క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

టీబి భారత్ అభియాన్ కార్యక్రమానికి బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేశారు. నిక్షయామిత్ర ద్వారా క్షయ వ్యాధి రోగులకు నిత్యవసర సరుకులైన బియ్యం, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్స్ ,గుడ్లు, మల్టీ విటమిన్ సిరప్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాగృతి హాస్పిటల్ నిర్వాహకులు గంగాధర్ మాట్లాడుతూ క్షయ వ్యాధి రోగులను ఆదుకునేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు తోచినంత సహాయం చేయాలని ఆయన కోరారు. 2025 నాటికి క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలించే దిశగా సమాజ భాగ్యస్వామ్యంతో క్షయ వ్యాధిని అంతం చేయాలని దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ నరసింహ చారి, జాగృతి హాస్పిటల్ నిర్వాహకులు గంగాధర్, మహేందర్, జిల్లా టీబి సమన్వయకర్త శోభారాణి, సూపర్వైజర్లు శరత్, సంతోష్, రిజ్వాన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.