జనాభ గణనలో బి.సి కుల గణన చేపట్టాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వo త్వరలో చేపట్టబోయే జనాభ గణనలో బి.సి కుల గణన చేపట్టాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. నవంబర్ 20 న కోటప్పకొండ లో జరగనున్న బొందిలి రాష్ట్ర మహా సభ పోస్టర్ ను నేడు బిసి భవన్ లో ఆవిష్కరించారు.ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ దేశ జనాభాలో 50 శాతం జనాభా గల బీసీలకు ఇప్పటికీ ఏ రంగంలో కూడా ప్రజాస్వామ్య వాటా లభించలేదని,బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం కోసం పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. బీసీ సంఘాలు చిన్న,చిన్న రాయితీల కోసం సమయం వృధా చేసుకోకుండా రాజ్యాధికారం కోసం జరిగే పోరాటంకు నాయకత్వం వహించి ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ కులాల వారు కొన్ని వేల సంవత్సరాలుగా తమ కుల వృత్తుల ద్వారా దేశ సంపద సృష్టించి – సమాజాన్నితికించారు, నడిపించారు. నేడుప్రజాస్వామ్యవస్థలోజీవిస్తున్నాంఅన్నికులాలకు, సామాజికవర్గాలకుజనాభాప్రకారంవిద్య,ఉద్యోగ,ఆర్థిక, రాజకీయ,సామాజిక,వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, కాంట్రాక్టర రంగాలలో జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి కానీ 75 సంవత్సరాల కాలంలో ఏ రంగంలో కనీస వాటా కూడా లభించలేదు. దేశ సంపద సృష్టించారు కానీ సంపదలో వాటా లభించలేదు, పన్నులు కట్టారు కానీ బడ్జెట్ వాటా లభించలేదు, ఓట్లేసి ప్రభుత్వాలను ఎన్నుకున్నారు కానీ అధికారం వాటా ఇవ్వడం లేదు, పార్టీలు మాటున అధికారం చాటున అగ్రకులాలు బీసీ కులాలను అణిచిపెట్టారు. గత 75 సంవత్సరాలుగా పాలించిన ప్రభుత్వాలు బీసీలను అణచిపెట్టారు, బిచ్చగాళ్లను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో 56 శాతం జనాభా గల బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని విమర్శించారు. రాజకీయ పార్టీలు బి.సి లను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని సుదాకర్ విమర్శించారు. పేరుకే మనది ప్రజాస్వామ్య దేశం కాని ఆచరణలో ధనస్వామ్య దేశంగా మారిపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమం లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి క్షత్రి పండరి బాయి,మహా రాణా ప్రతాప్ సింగ్ బొందిలి అన్న దాన సమాజ్ ప్రెసిడెంట్ విజయ్ ప్రతాప్ సింగ్,బొందిలి సేవా సంఘం ప్రెసిడెంట్ సాంబ సింగ్,సెక్రెటరీ రామ్ బాలాజీ సింగ్,వీరాంజి సింగ్ ,రాణా ప్రతాప్ సింగ్, నీల వెంకటేష్, గుజ్జ కృష్ణ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.