ఇవాళ సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించేందుకు గురువారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ప్రెస్మీట్ నిర్వహిస్తారని అందరూ భావించిన విషయం తెలిసిందే. అనూహ్యంగా చివరి నిమిషంలో కార్యక్రమం రద్దు అయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా.. శుక్రవారం కేసీఆర్ ప్రెస్మీట్ నిర్వహించబోతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం ఫేస్బుక్ వేదికగా పినపాక గులాబీ పార్టీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ‘ఈరోజు పెద్ద సార్ ప్రెస్మీట్ ‘ అంటూ పేర్కొనడం చర్చనీయాంశమైంది. మరి ఇవాళైనా కేసీఆర్ మీడియా ముందుకు వస్తారో లేదో చూడాలి. వస్తే.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఏ విధంగా స్పందిస్తారో అని రాజకీయ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.