ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా, చండూరు లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం కెసిఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది

ఇప్పటికే అన్ని జిల్లాల్లో గల దివ్యాంగులకు ఒక్కో వాహనానికి 35వేల విలువ చేసే, బ్యాటరీ ట్రై సైకిల్స్ అందజేయడం జరిగింది.

ప్రభుత్వానికి తోడుగా నా వంతుగా స్వంతంగా ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా ట్రై వెహికల్స్ అందించాను.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ట్రై మోటార్ సైకిల్ ప్రభుత్వం ఇస్తుంది.

అర్హులైన దివ్యాంగులందరికీ ఏదో ఒక సహాయం తప్పకుండా అందచేస్తాం.

దివ్యాంగులు అంగ వైకల్యంతో ఉండవచ్చు కానీ, ప్రతిభ లో ఎవరికంటే తక్కువ కాదు.

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి గతంలో ఎవరూ చేయలేనంత చేస్తున్నది

దివ్యాంగులకు పెన్షన్ గతంలో కేవలం 75 రూపాయలుంటే, ఇప్పుడు 3 వేల 16 రూపాయలు చేసింది సిఎం కెసిఆర్

దేశంలో బిజెపి పాలిత రాష్ట్రంలో ఎక్కడా దివ్యాంగులకు నెలకు 3,016 ఇవ్వడంలేదు

విద్యలో 4 శాతం, ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం

డబుల్ బెడ్ రూం ఇండ్లల్లో కూడా దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత సిఎం కెసిఆర్ గారి ది

దివ్యాంగుల కోసం కార్పొరేషన్ ద్వారా మూడు చక్రాల వాహనాలు, బ్యాటరీ ట్రై సైకిళ్ళు, వీల్ ఛైర్లు, లాప్ ట్యాపులు, సెలఫోన్లు, ఇతర ఉపకరణాలు ఉచితంగా అందించారు.

2021, ఏప్రిల్ 16 న, ఒకేసారి 17 వేల మంది వికలాంగులకు 24 కోట్ల 34 లక్షల రూపాయల విలువచేసే వాహనాలు ఉపకరణాలు అన్ని జిల్లాల్లో అందించాం.

గతంలో ఏ ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమం కోసం ఆలోచన చేయలేదు

సిఎం కేసీఆర్ దివ్యాంగుల పట్ల ప్రత్యేక ప్రేమ ఉన్న నాయకుడు

అందుకే కరోనా సమయంలోనూ ఎలాంటి లోటు లేకుండా పెన్షన్లు అందించారు.

దివ్యాంగులను అంగవైకల్యం లేని వారు వివాహం చేసుకునేందుకు ముందుకు వస్తే వారికీ 1 లక్షా 25 వేల రూపాయలను ప్రోత్సాహకంగా అందిస్తున్నాం.

ప్రభుత్వం గతంలో ఎవరూ ఎప్పుడూ చేయని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నది

ప్రభుత్వానికి అండగా మీరు ఉండండి

మీకు అండగా ప్రభుత్వం ఉంటుంది

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, దివ్యాంగుల సంఘం నేతలు, పలువురు దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.