రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం

..గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనివారం హైదరాబాదులో విడుదల చేసిన ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ నిలిపివేత, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈ కేసును సీబీఐ లేదా జ్యూడిషియల్ విచారణకు ఆదేశించాలని కోరిన బీజేపి బీజేపీని బదనాం చేసే కుట్ర జరుగుతోందని ఆందళోన ఆధారాల్లేకుండా బీజేపీ పేరును పదేపదే ఎందుకు లాగుతున్నారని ప్రశ్న బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసి మునుగోడు ఎన్నికపై ప్రభావం చూపేలా కుట్ర జరుగుతోందన్న పిటిషనర్ తదుపరి విచారణను వచ్చేనెల 4కు వాయిదా వేసిన ధర్మాసనం ఎమ్మెల్యేల వ్యవహారంపై సమగ్ర నివేదికను అందజేయడంతోపాటు ఆధారాలు జతపర్చాలని ఆదేశం 4 గురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ పోలీసులు చేపట్టిన విచారణను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా తెలంగాణ పోలీసుల విచారణ కొనసాగుతోందని, ఎలాంటి ఆధారాలు లేకపోయినా బీజేపీ పేరును పదేపదే లాగుతున్నారని పేర్కొంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను ఈ రోజు హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపున న్యాయవాది పలు అభ్యంతరాలను లేవనెత్తారు. ‘‘4గురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీకి ఎలాంటి ప్రమేయమూ లేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫాంహౌజ్ లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు కలిసి ఉండగా పోలీసులు ప్రవేశించిన విషయం. ఈ వ్యవహారంలో బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ప్రత్యక్ష, పరోక్ష పాత్ర ఉన్నట్లు ఆధారాలు కూడా లభించలేదు. ఎఫ్ఐఆర్ లో కూడా ఈ అంశం లేదు. అయినప్పటికీ బీజేపీ పేరును పదేపదే ఎందుకు లాగుతున్నారు? బీజేపీ ప్రతిష్టకు భంగం కలిగించడం ద్వారా మునుగోడు ఉప ఎన్నికపై ప్రభావం చూపడానికి జరుగుతున్న కుట్రగా భావిస్తున్నాం. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతున్నాం’’అని పేర్కొన్నారు. అనంతరం హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ ఈ వ్యవహారంపై పోలీసులు కొనసాగిస్తున్న విచారణను తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చేనెల 4కు వాయిదా వేసింది. పిటిషనర్ కోరినట్లుగా ఈ కేసును సీబీఐకి ఇవ్వాలా? న్యాయ విచారణకు ఆదేశించాలా? లేక తెలంగాణ పోలీసులు చేస్తున్న విచారణను కొనసాగించాలా? అనే అంశంపై ఆరోజు విచారణ జరపాలని నిర్ణయించింది. అందులో భాగంగా నవంబర్ 4న జరిగే విచారణ నాటికి ఈ కేసుకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వడంతోపాటు తగిన ఆధారాలను జతపర్చాలని పోలీస్ శాఖను ఆదేశించిందని బిజెపి రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిపేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.