టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు పై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు రిమాండ్‌ విధించడానికి నిరాకరిస్తూ, పోలీసుల రిమాండ్‌ రిపోర్ట్‌ను హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. ఆ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది.సైబరాబాద్ పోలీసుల రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. నిందితులు సైబరాబాద్ సీపీ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని కోర్టు ఆదేశించింది.మొయినాబాద్‌ ఫాంహౌజ్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రలోభపెట్టిన వ్యవహారంలో నింది0తులైన రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌లు 24 గంటల పాటు హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదని హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. నగరంలో వారు ఉంటున్న చిరునామా వివరాలను సాయంత్రం 6 గంటలలోపు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు తెలియజేయాలని పేర్కొంది. తమను ప్రలోభాలకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డితో గానీ, ఇతర సాక్షులతో గానీ మాట్లాడే ప్రయత్నాలు చేయరాదని స్పష్టంచేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు రిమాండ్‌ విధించడానికి నిరాకరిస్తూ, పోలీసుల రిమాండ్‌ రిపోర్ట్‌ను హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు కొట్టివేసింది.ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు రిమాండ్‌ విధించడానికి నిరాకరిస్తూ, పోలీసుల రిమాండ్‌ రిపోర్ట్‌ను హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. ఆ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు నేడు కీలక ఆదేశాలు

Leave A Reply

Your email address will not be published.