రాహుల్ ని కలిసిన వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య తన బృందం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాహుల్ గాంధీ తో మహబూబ్ నగర్ పట్టణం లోని గోపాల్ రెడ్డి గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య తన బృందం తో ఆదివారం కలిసారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ మేమొంటో & రాష్ట్రం లో, దేశంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పై బి జె పి, తెరాస లు వికలాంగులకు చేసిన మోసం పై వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వికలాంగులకు జరిగిన మోసాన్ని తెరాస ,బిజెపి వికలాంగుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహించ తీరును గమనించారు వినతిపత్రం క్షుణ్ణంగా చదివి భవిష్యత్తులో వికలాంగుల సమస్యలను మొదటి ప్రాధాన్యతగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వినతిపత్రంలో ఉన్న అంశాలు
1)2012లో ఏక సభ్య కమిషన్ ద్వారా యూపీఏ ప్రభుత్వము తయారుచేసిన వికలాంగుల హక్కుల చట్టములో బిజెపి వికలాంగులకు నష్టం జరిగే విధంగా అనేక మార్పులు తెచ్చిoది వికలాంగులకు ప్రత్యకించి వికలాంగుల రకాల సంఖ్య 7 నుంచి 21 కి పెంచడము అదే సమయంలో ఉద్యోగ రిజర్వేషన్లు ఐదు శాతం లో ఉన్న అంశాన్ని నాలుగు శాతం కు తగ్గించడం ఎస్సీ, ఎస్టీ ,ఓబీసీ కమిషన్ల మాదిరిగా నేషనల్ స్టేట్ కమిషన్ ఏర్పర్చకపోవడం చేసింది
2) మునుగోడులో 2012లో ఫ్లోరైడ్ నివారణ కొరకు యూపీఏ ప్రభుత్వము 100 కోట్ల ప్రాజెక్టును కేటాయించింది బిజెపి అధికారము లోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు రద్దు చేసింది
3) వికలాంగుల పరికరాల పై జిఎస్టి విధించింది
4)వికలాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పరచలేక పోయింది
5)ఉపాధి హామీ పథకంలో UPA ప్రభుత్వం ఇచ్చిన ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు 150 రోజులు పని కల్పించాల్సింది ఉండగా దేశవ్యాప్తంగా నిర్లక్ష్యం గురైంది.
తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల హక్కుల పట్ల ,సంక్షేమ పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన మోసాన్ని కూడా వివరించడం జరిగింది
1)వికలాంగుల హక్కుల చట్టం 2016 పూర్తిగా నిర్లక్ష్యం చేయడం
2)5 శాతం బడ్జెట్ ను కేటాయించకపోవడం
3) వికలాంగుల సంక్షేమ శాఖను విలీనం చేయడం
5)నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న బ్యాక్లాగ్ ఉద్యోగాలు పంపకపోవడం
6)ఉద్యోగుల సంఖ్య సింగల్ డిజిట్ కే పరిమితం కావడం
7) వికలాంగుల Motorized vehicles పెట్రోల్ సబ్సిడీ ఇవ్వక పోవడం తో పాటు అనేక అంశాలు వివరించడం జరిగింది
మొదట ప్రాదాన్యత గా వికలాంగుల సమస్యలను పరిష్కరిస్తానని హామి ఇచ్చారు…. మేము ఉద్యమాల గురించి చెప్పబోగ నాకు తెలుసని అభినందనలు తెలియ జేశారు ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్, వికలాంగుల ప్రతినిధి డాక్టర్ రాజీ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ వికలాంగుల విభాగం అధ్యక్షులు దేశాగాని సతీష్ గౌడ్,M.A సలీం, పొలగాని వెంకటేష్ గౌడ్, మీసాల ఉపేందర్, నగేష్ గౌడ్, తిరుపతయ్య, ఆంజనేయులు, రాఘ వేంద్ర లు కలసిన వారిలో ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.