పర్యావరణ సంరక్షణకు మొక్కలు నాటాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రతీ ఒక్కరు సమాజంలో పర్యావరణ సంరక్షణకు మొక్కలు నాటవలసిన అవసరం ఏంటో ఉందని ఎఎస్సార్ ఫౌండేషన్ అద్యక్షులు, డాక్టర్ అయ్యల సంతోష్ అన్నారు. ఆదివారం బాన్సువాడ మండల పరిధిలోని సోమేశ్వర్ లిబర్టీ పాఠశాలలో ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ-పరిరక్షణ లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో,పాఠశాలలో తమ వంతు బాధ్యతగా ఒక మొక్కనైన నాటడం అలవాటు చేసుకోవాలని, రోజు రోజుకు గాలి కాలుష్యం ఎక్కువైతున్నందున ఓజోన్ పొర కు నష్టం జరుగుతుoదని, గాలి కాలుష్యం వల్ల మనము వివిధ రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని, పర్యావరణంను పరిరక్షించే బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో లిబర్టీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిలు,ఏఈవో లక్ష్మణ్, ఫౌండేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉళ్లేంగల సాయిలు, బీర్కూర్ మండల నాయకులు సంతోష్, సాయిలు, వివేక్, మహిపల్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.