కేసీఆర్ దార్శనికులు,పాలనాదక్షులు

.. టాంజానియా ఎంపీ జెర్మియ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప దార్శనికులని,పాలనాదక్షులని టాంజానియా దేశానికి చెందిన పార్లమెంటు సభ్యులు జెర్మియ కొనియాడారు.అహింసా మార్గంలో మహోద్యమాన్ని నడిపి ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన మహానేత కేసీఆర్ అని వ్యాఖ్యానించారు.తాను సాధించిన రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయి అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేశారని,ఇంకా ముందుకు సాగుతున్నారని ఆయన చెప్పారు.ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీలో రీసెర్చ్ స్కాలరుగా ఉన్న జెర్మియ,తన దేశం టాంజానియాలో 2020 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు.తన పరిశోధన పత్రాలను సమర్పించేందుకు గాను హైదరాబాద్ వచ్చిన ఆయన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను బంజారాహిల్స్ లోని నివాసంలో ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారిద్దరు అరగంట పాటు ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నారు.ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలరుగా చేరేందుకు, ఆ తర్వాత తానిక్కడికి పలుమార్లు వచ్చి వెళ్లానని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు,ఆ తర్వాత పోల్చితే ఇప్పుడు హైదరాబాద్ నగరం,రాష్ట్రం అన్ని రంగాలలో పురోగమించిందని జెర్మియ వివరించారు.ఈ సందర్భంగా ఆయన టాంజానియా దేశ కాల పరిస్థితుల గురించి రవిచంద్రకు వివరిస్తూ,తమ దేశాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.అందుకు వద్దిరాజు సానుకూలంగా స్పందించారు.జెర్మియ వెంట టాంజానియాలో ఆయన గురువు, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ రామానుజ రావు, మిత్రులు శ్రవణ్ కుమార్, చిరంజీవి, పాల్వంచ రాజేష్, ఆకుల సాయి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.