అక్రమ సీఎచ్ గుట్టు రట్టు చేదించిన పోలీసులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/రామారెడ్డి ప్రతినిధి: అక్రమ సీఎచ్ గుట్టు రట్టు చేదించిన పోలీసులు అని తెలిపారు. ఎక్సైజ్ శాఖ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం తెల్లవారుజామున రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో నిజామాబాద్ సీఐ , కామారెడ్డి సీఐ తో పాటు పోలీసు బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించి అనుమతి లేని స్థలంలో కల్తీ కల్లుతో పాటు సీహెచ్‌తో ను గుర్తించి 15.6 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకున్నారు తదుపరి విచారణలో ఇంటి నుండి 1.14 కేజీల పచ్చి సీహెచ్‌ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు . బి పరశురామ గౌడ్ తండ్రి మల్లా గౌడ్ గ్రామం అన్నారం, రామారెడ్డి మండలం , సాయంత్రం మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ క్రాస్ రోడ్స్ వద్ద రూట్ వాచ్ నిర్వహించి, అక్రమంగా ముడి సిఎచ్ , అల్ప్రోజోలం రవాణా చేస్తున్న ముఠాను చేదించి వారిని పట్టుకుని అట్టి సీఎచ్ ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. . 1.08KG ముడి సీఎచ్ , 50 గ్రాముల ఆల్ప్రోజోలం , ఒక ద్విచక్ర వాహనం B. బాలరాజు గౌడ్ తండ్రి రామ గౌడ్ గ్రామం గోరంటీయల్ , మండలం గంభీరావుపేట్ , జిల్లా రాజన్న సిరిసిల్ల అనే ఒక వ్యక్తిని పట్టుకుని అరెస్టు చేశారు. మొత్తం (02) కేసులు నమోదు మరియు ఇద్దరిని అరెస్టు చేసి 2.28కిలోల ముడి సిహెచ్‌, 50జిఎంఎస్‌ ఆల్‌ప్రోజోలం, బైక్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు .పి.వేణు మాధవరావు (సర్కిల్ ఇన్‌స్పెక్టర్-ఎక్సైజ్ , బి.రామ్ కుమార్ (సబ్-ఇన్‌స్పెక్టర్-ఎక్సైజ్, ఎం.విక్రమ్ సబ్-ఇన్‌స్పెక్టర్-ఎక్సైజ్, శ్రీను ప్రసాద్ (హెడ్ కానిస్టేబుల్), బోజన్న (కానిస్టేబుల్), అవినాష్ (కానిస్టేబుల్), ఉత్తమ్ (కానిస్టేబుల్), గంగాధర్ (కానిస్టేబుల్) పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.