క’న్నీటి’ని మిగిల్చిన ప్రమాదం.. కేబుల్‌ బ్రిడ్జి కూలిన ఘటనలో 100 మందికిపైగా మృతి

gujarat-cable-bridge-collapse.jpg

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ఓ కేబుల్‌ బ్రిడ్జి కూలిపోయిన ఘటన విషాదంలో నెట్టేసింది. గుజరాత్‌లో ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 100 మందికిపైగా మృతి చెందారు. చాలామంది వరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు, వృద్ధులే ఉన్నారు. మచ్చు నదిపై కొత్తగా నిర్మించిన ఈ కేబుల్ వంతెనను మరమ్మతులు చేపట్టి మూడు రోజుల క్రితం ప్రారంభించారు. ఆ సమయంలో వంతెనపై 500 మంది ఉన్నారు. అందరూ ఛత్ పండుగను నేపథ్యంలో బ్రిడ్జిపై ఉండగా ఈ జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 400 మంది గల్లంతు కాగా, రెస్య్కూటీమ్‌ రంగంలోకి దిగా 200 మంది వరకు కాపాడారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం వైమానిక దళానికి చెందిన గరుడ కమాండోలను పంపించారు. దీనితో పాటు, గుజరాత్ ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్ 02822-243300 ను కూడా జారీ చేసింది. స్థానిక ఎమ్మెల్యే, గుజరాత్ ప్రభుత్వంలో మంత్రి బ్రిజేష్ మెర్జా ఘనటనపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. అయితే మృతుల్లో 25 మందికి పైగా చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌-ఎస్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు అనేక బృందాలు రెస్క్యూ కోసం బయలుదేరాయి. భారత నావికాదళానికి చెందిన 50 మంది సిబ్బందితో ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన 3 స్క్వాడ్‌లు, 30 మంది ఐఎఎఫ్ సిబ్బందితో రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల కోసం ఆర్మీకి చెందిన 3 స్క్వాడ్‌లు, రాజ్‌కోట్, జామ్‌నగర్, డయ్యూ, సురేంద్రనగర్‌ల నుండి అధునాతన పరికరాలతో 7 అగ్నిమాపక దళ బృందాలు మోర్బికి బయలుదేరి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, స్టేట్ రిజర్వ్ పోలీసుల స్క్వాడ్‌లు కూడా రెస్క్యూ ఈ సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి.

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్బ్రంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోడీ.

కేబుల్‌ బ్రిడ్జిని ఎప్పుడు నిర్మించారు..?

ప్రమాదానికి గురైన కేబుల్‌ బ్రిడ్జి చాలా పురాతనమైనది. వందేళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి. ఈ వంతెనను143 ఏళ్ల క్రితం మచ్చూ నదిపై నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వంతెనను 1879 ఫిబ్రవరి 20న బాంబే గవర్నర్ రిచ్చర్డ్ టెంపుల్ ప్రారంభించారు. అనాడు ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 3.5 లక్షల ఖర్చు చేయగా, బ్రిడ్జికి అవసరమైన సామాగ్రి మొత్తం ఇంగ్లాండ్‌ నుంచి తెప్పించారు. బ్రిటిష్‌ కాలం నాటి ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో గత ఆరు రెండేళ్లుగా బ్రిడ్జిని మూసి వేశారు. తర్వాత బ్రిడ్జిని పూర్తిగా మరమ్మతులు చేపట్టి గత మూడు రోజుల కిందటే ప్రారంభించారు. బ్రిడ్జిపై 500 మందికిపైగా ఒక్కసారిగా రావడంతో బ్రిడ్జి కూలిపోయింది.

దర్బార్‌ గఢ్-నాజర్ బాగ్‌ను కలుపుతూ ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జి పొడవు 765 అడుగులు. అయితే గుజరాతీ నూతన సంవత్సరం సందర్భంగా అక్టోబర్ 26న మరమ్మతులు చేపట్టి తిరిగి ఓపెన్‌ చేశారు. ఇప్పుడు ఈ హ్యాంగింగ్ పూల్ మహాప్రభుజీ సీటు, సమకంఠ ప్రాంతం మొత్తాన్ని కలుపుతుంది. ఈ కేబుల్ వంతెన గుజరాత్‌లోని మోర్బీకే కాకుండా యావత్ దేశానికి చారిత్రక వారసత్వం.

Leave A Reply

Your email address will not be published.