కార్తీక సోమవారం సందర్బంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ఆలయ అర్చకులు శివునికి ప్రత్యేకమైన రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలను నిర్వహిస్తున్నారు. పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. భక్తులు పెద్దఎత్తున కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ఆవరణలో దీపాలు వెలించారు. స్వామివారి దర్శనం కోసం భారీసంఖ్యలో క్యూలైన్లలో వేచిఉన్నారు. ఇక భద్రాచలం వద్ద గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.. కార్తిక దీపాలను నదిలో వదులుతున్నారు. హైదరాబాద్‌లోని శైవక్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి. కార్తిక దీపాలు వెలిగించిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.