పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ మండలంలోని బోర్లం, జక్కల్ దాని తండాలో సోమవారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ చైర్మన్ సంగ్రామ్ నాయక్, వైస్ చైర్మన్ నెర్రే రామలక్ష్మి, సర్పంచ్ సరళ శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు మండల డైరెక్టర్ పెద్దపట్లోళ్ల దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు రమధాన్యం ధనోరులకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి గిట్టుబాటు ద్వారా పొందాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంద శ్రీనివాస్ , వైస్ చైర్మన్ నర్రే రామలక్ష్మి, సొసైటీ డైరెక్టర్లు మన్నే రమేష్, జనార్దన్ రెడ్డి , బాపురెడ్డి, క్యాంప్ ఎంపిటిసి పాల్త్య యశోద , జక్కల దాని తండా సర్పంచ్ సంగ్య నాయక్, సాయిబాబా,గోపాల్ సర్, బొర్లం ఫ్యాక్స్ సీఈవో సురేందర్ , వార్డ్ మెంబర్ మద్ది మొగులయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.