తెలంగాణ సాధనలో తెలంగాణ ఉద్యోగుల సంఘంది క్రియాశీలక పాత్ర

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో, ఐపీఎం స్టేట్ ప్రెసిడెంట్ మహేష్ నిర్వహిస్తున్న, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ & ఫుడ్ (హెల్త్) ఆఫీస్, ఐపీఎం యూనిట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం పెద్దలు చైర్మన్ ఎ. పద్మాచారి, ప్రెసిడెంట్ ఎం. రవీందర్ కుమార్, జనరల్ సెక్రటరీ, హారిష్ కుమార్ రెడ్డి, బి.లక్ష్మారెడ్డి, నేషనల్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా జ్యూడిషిరి ఎంప్లాయిస్ కాంఫిడరేషన్, ఎండీ.ముంతాజ్ పాషా (అడ్వకేట్),గ్రేటర్ సిటీ ప్రెసిడెంట్, ఎన్.నర్సింగ్ రావ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎ.పద్మాచారి మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమ సాధనలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్ళు, నిధులు, నియామకాలపైన అలాగే ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్న నష్టాలపైన, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌస్ కమిటీలో ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని కేసీఆర్ తో చర్చించడం జరిగింది. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఉద్యోగుల సమస్యల మీద చర్చించి, వాటి పరిష్కారాల కోసం కృషి చేయడం జరిగిందన్నారు. ప్రతీ ఉద్యమంలో మేము తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితోటి సుదీర్ఘంగా, సకలజనుల సమ్మె గాని అదే విధంగా ఉద్యోగుల గర్జన గాని పెండౌన్ గాని పొలిటికల్ గాని, ప్రతి దాంట్లో కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిటీ కలిసి పనిచేయడం మాకు చాలా గౌరవంగా ఉన్నదన్నారు. అలాగే తెలంగాణ లో ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేసుకోవాలి అనేది ప్రధాన డిమాండ్ అన్నారు. ఆంద్రప్రదేశ్ నుండి 1800 మంది తెలంగాణకు రావాలని పెట్టుకున్నారు, అందులో 600 మంది తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు వాళ్లకు తెలంగాణ ఉద్యోగులు స్వాగతం తెలుపుతూ దానిమీద గవర్నమెంట్ కు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. 1200 మంది ఆంధ్రా ఉద్యోగులు ఇక్కడికి రావడాన్ని తెలంగాణ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారన్నారు. అదేవిధంగా ఉద్యోగుల పెండింగ్ సమస్యలు క్లియర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చెయ్యడం జరిగిందన్నారు. ప్రధానంగా పెండింగ్ లో ఉన్న మూడు DA లు క్లియర్ చేయ్యాలి, అలాగేతెలంగాణ రెండవ పిఆర్సి కమిటీ వెయ్యాలి, అలాగేతెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై తెలంగాణ అడ్మిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను పునరుద్ధరించాలన్నారు. అదేవిధంగా బి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యోగుల సంఘానికి 2001 నుంచి తెలంగాణ ఎంప్లాయిస్ సమస్యల పట్ల, సీఎం కేసీఆర్ తోటి కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది, జ్యుడీషియల్ ఎంప్లాయిస్ కి జరిగే నష్టాలను కూడా కేసీఆర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎంప్లాయిస్ యొక్క సమస్యలు కూడా పరిష్కారం కావాలంటే మనకు ప్రత్యేక తెలంగాణ కావాల్సిందే అని అప్పుడే మేము చెప్పడం జరిగింది. ఏదేమైనా తెలంగాణ ఉద్యోగుల సమస్య, తెలంగాణ నీళ్లు, నిధులు, నియమకల పైన గట్టి పట్టు. ఉన్న సంఘం తెలంగాణ ఉద్యోగుల సంఘం, వారి కృషి అమోఘమైందన్నారుకేసీఆర్ కి ప్రతి ఉద్యోగికి జరిగిన అన్యాయాన్ని, నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తెలంగాణ ఉద్యమం తెచ్చింది. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యి కలిసి పని చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ముస్తఫా పాషా, హైకోర్టు సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ, తెలంగాణకు జరిగిన అన్యాయానికి న్యాయవాదులందరూ ఉద్యమించారన్నారు. తెలంగాణ ఉద్యోగుల సమస్యల గురించి తెలంగాణ ఉద్యోగుల సంఘంతోటి కూడా సుదీర్ఘంగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యోగులకు ఏమైనా సమస్యలు వస్తే వెన్నుదన్నుగా ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి, అరవింద్ కుమార్ ట్రెజరర్, జాకబ్ వైస్ ప్రెసిడెంట్, నజీర్, ఎస్ ఎస్ కిషోర్, రాజేంద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.