ట్రాక్టర్ కిందపడి బాలుడి మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కోటగిరి మండలం దేవుని గుట్ట తండాకు చెందిన జ్ఞానేశ్వర్(10) అనే బాలుడు ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. వరి ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్ వెనుక భాగంలో బాలుడు ఆడుతుండగా డ్రైవర్ బాలుడిని గమనించకుండా వెనుకకు తీయగా, బాలుడు ట్రాక్టర్ వెనుక చక్రాల కింద పడి మృతి చెందాడు. దీంతో దేవుని గుట్ట తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.