5జి రేసులో బిఎస్ఎన్ఎల్

త్వరలో అందుబాటులోకి రానున్న సేవలు

ప్రభుత్వరంగ బీఎస్ ఎన్ ఎల్ సైతం వచ్చే ఆగస్ట్ 15 నుంచి 5జీ సేవలను అందిస్తుందని కేంద్ర టెలికం మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. కాగా 200పట్టణాల్లో 5జీ సేవలు 2023 మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. దీంతో బీఎస్ఎన్ఎల్ సైతం 5జీ రేసులోకి అడుగుపెట్టనుందని ఖాయమైపోయింది. 5జీ ప్లాన్లు అందుబాటు ధరల్లోనే ఉంటాయని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ మరింత చౌకగా అందిస్తుందేమో చూడాలి. వచ్చే రెండేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 80-90 ప్రాంతాల్లో 5జీ సేవలను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అశ్వని వైష్ణవ్ చెప్పారు. 5జీ సేవలు కూడా అందుబాటు ధరల్లోనే ఉండాలన్నారు. ఎయిర్ టెల్, జియో పోటాపోటీగా తమ సేవలను విస్తరిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ రెండింటి నుంచి ముందుగా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. నిజానికి బీఎస్ఎన్ఎల్ నుంచి ఇంతవరకు 4జీ సేవలు అందుబాటులోకి రాలేదు. ఈ తరుణంలో 5జీ సేవలపై మంత్రి ప్రకటన చేడయం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.