రాష్ట్ర అవతరణ దినోవత్సం సందర్భంగాఏపి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన అమిత్ షా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోవత్సం సందర్భంగా పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. అద్భుతమైన సంస్కృతి గొప్ప మనసున్న ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి చెందింది. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాను‘ అంటూ అమిత్ షా తెలుగులో ట్వీట్ చేయడం విశేషం.అలాగే నవంబర్ 1న అవతరణ దినోత్సవాలు జరుపుకుంటున్న వివిధ రాష్ట్రాలకు కూడా అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఏపీ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహిస్తోంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాజ్భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం పేదలకు అనుకూలమైన చర్యలను ప్రారంభించడం ద్వారా అభివృద్ధి పథంలో భారీ పురోగతి సాధిస్తోందని గవర్నర్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.