భారతీయ స్టార్టప్లు ఉద్యోగాల నియామకాల్లో కోతలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారతీయ స్టార్టప్లు ఉద్యోగాల నియామకాల్లో కోత విధించాయి. ఈ కోతలు ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి.  శాశ్వత ఉద్యోగుల నియామకాలు గత 12 నెలల్లో గణనీయంగా 61 శాతం తగ్గాయని ఒక కొత్త నివేదిక వెల్లడించింది. రోజర్ పే వ్యాపార బ్యాంకింగ్ ప్లాట్ఫారమ్ నివేదిక ప్రకారం.. చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ (సీఎక్స్ఓ) నియామకాలు అక్టోబర్ 2021 నుండి ఏకంగా 93 శాతం తగ్గిందని నిరూపించింది. మాంద్యం మబ్బులకు మారుతున్న పరిణామాలతో గత 12 నెలల్లో నియామక విధానాలలో భారీ మార్పులకు దారితీసింది. తక్కువ నియామకాలు ఉన్నప్పటికీ ఇప్పటికే ఉన్న ఫుల్టైమ్ ఉద్యోగులకు ఖర్చు చేసిన మొత్తం జీతం 64.7 శాతం పెరిగింది. అయితే ఈ పెరుగుతున్న జీతాలు ఉన్న మెరుగైన ఉద్యోగుల మధ్య సమానంగా పంపిణీ చేయబడడం లేదని తేలింది. ముఖ్యంగా ఉన్నత వేతన శ్రేణిలో మార్పులు లేవని నివేదిక పేర్కొంది.
“భారత స్టార్టప్ ఎకోసిస్టమ్ గత కొన్ని నెలలుగా ఎదురుగాలిని ఎదుర్కొంటోంది. అయితే అవి అటువంటి డైనమిక్ వాతావరణానికి తగ్గట్టుగా.. అనుకూలించేవిగా లేవు. స్టార్టప్లు బలమైన టీంలను రూపొందించడం ద్వారా తమ వర్క్ఫోర్స్ను తగ్గించుకుంటున్నాయని డేటా సూచిస్తుందని నివేదికలో తేలింది.  అనేక స్టార్టప్లు ఈ కాలంలో నిధుల లభ్యత కష్టంగా మారడంతో చాలా వరకు తమ నియామకాలను తగ్గించుకుంటున్నాయి.”డిపార్ట్మెంట్లలో నియామకాలు తగ్గినప్పటికీ సాంకేతికతలో నియామకాలు తక్కువ ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. సాంకేతికత సంబంధిత ఉద్యోగాలు మొత్తం శ్రామికశక్తికి వారి సహకారాన్ని 4 శాతం మేర స్వల్పంగా పెంచగలిగాయి. అయితే సాధారణంగా నియామకాల ధోరణి మందగిస్తోంది” అని నివేదిక తేల్చింది.పర్మినెంట్ ఉద్యోగుల నియామకం తగ్గిపోయినప్పటికీ స్టార్టప్ల కోసం తాత్కిలిక ఉద్యోగులను (గిగ్ వర్కర్స్) తీసుకుంటూ సాలరీలు తక్కువ ఇస్తూ తమ పనిని చేసుకుంటున్నాయి. అక్టోబర్ 2021 నుంచి గిగ్ వర్కర్లకు చెల్లింపులు 153 శాతం వృద్ధిని సాధించాయి. సెమీ-గిగ్ వర్క్ఫోర్స్ మోడల్కి మారిన మొత్తం కంపెనీల సంఖ్య 15 శాతం పెరిగింది.రూ.20000 కంటే తక్కువ వేతనం పొందే సెమీ-స్కిల్డ్ గిగ్ వర్కర్లు స్టార్టప్ల ద్వారా నియమించబడుతున్న గిగ్ వర్కర్ల మొత్తం పూల్కు అత్యధిక సహకారం అందిస్తున్నారు. ఇక కొన్ని మెరుగైన కంపెనీలు గిగ్ వర్కర్స్ కు రూ. 20000-రూ. 40000 మధ్య ఇస్తున్నాయి. “అయితే ఈ కార్మికులు వరుసగా 26 శాతం మరియు 52 శాతం వృద్ధితో నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్న విభాగంలో ఉన్నారు. అయినప్పటికీ రూ. 85000 నుండి రూ. 150000 కంటే ఎక్కువ సంపాదించే నైపుణ్యం కలిగిన గిగ్ వర్కర్లు మొత్తం ఈ వ్యవస్థకు అతి తక్కువ సహకారం అందిస్తున్నారు. గత ఏడాదిలో ఈ గిగ్ వర్కర్స్ కేటగిరిలోనే అత్యధిక వృద్ధిని నమోదు చేసింది” అని నివేదిక పేర్కొంది.20 రంగాలకు చెందిన 1000 కంటే ఎక్కువ భారతీయ స్టార్టప్లలో 25000 కంటే ఎక్కువ మంది ఉద్యోగుల డేటాను అక్టోబర్ 2021 నుండి సెప్టెంబర్ 2022 వరకు విశ్లేషించింది. ఈ మేరకు ఇవన్నీ ఉద్యోగులను తగ్గించేసి తాత్కాలిక ఉద్యోగులను తీసుకొని బండి నడిపిస్తున్నట్టు తేలింది.

Leave A Reply

Your email address will not be published.