అమరావతి రైతుల పాదయాత్రకు ఓకే చెప్పిన హైకోర్టు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అమరావతి రైతుల పాదయాత్రకు హై కోర్టు ఓకే చెప్పింది. పాదయాత్రను రద్దు చేయాలంటూ ప్రభుత్వం కోర్టులో వేసిన పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది. దీని మీద కొద్ది రోజుల క్రితం విచారణ జరిగింది. తీర్పుని రిజర్వ్ లో ఉంచిన హై కోర్టు ఈ రోజు వెలువరించింది. దీని ప్రకారం పాదయాత్రకు అనుమతించవద్దు అంటూ వైసీపీ సర్కార్ వేసిన పిటిషన్ ని కోర్టు కొట్టేసింది.తులు పాదయాత్ర చేసుకోవచ్చు అని స్పష్టం చేసింది. అయితే పాదయాత్రలో ఆరు వందల మంది దాకా రైతులు పాల్గొనవచ్చునని పేర్కొంది. ఇక రైతులకు అవసరం అయిన ఐడీ కార్డులను పోలీసులు వెంటనే ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలా ఐడీ కార్డులు ఉన్న రైతులే పాదయాత్రలో పాల్గొనవచ్చు అని పేర్కొంది.మరో వైపు రైతులకు సంఘీభావం తెలియచేయాల్సిన వారు దూరంగా ఉండి చేయవచ్చుననికూడా స్పష్టం చేసింది. అయితే వారు పాదయాత్రలో పాల్గొనరాదు అని స్పష్టం చేసింది. మొత్తానికి తాము ఇచ్చిన ఆదేశాలు షరతులు ఉల్లంఘన జరగకుండా పాదయాత్ర జరిగేలా చూడాలని పేర్కొంది.మొత్తానికి పాదయాత్రను రద్దు చేయాలని ప్రభుత్వం కోరిన విధంగా కోర్టు నుంచి ఆదేశాలు అయితే రాలేదు. అదే సమయంలో ఆరు వందల మంది వరకూ మాత్రమే రైతులు పాదయాత్రలో పాల్గొనవచ్చు అని కోర్టు పేర్కొంది.ఈ విధంగా చూస్తే ప్రభుత్వం అనుకున్నట్లుగా పాదయాత్ర రద్దు కాకపోవడం రైతుల విజయం అయితే అదే సమయంలో ఆరు వందల మంది కంటే ఎక్కువ రైతులు పాదయాత్రలో పాల్గొనరాదు అని ఆదేశించడం ద్వారా రాజకీయ నాయకుల కార్యకర్తలతో ర్యాలీగా వచ్చే అవకాశాలను కట్టడి చేసినట్లు అయింది అంటున్నారు.ఈ విధంగా వైసీపీకి కొంత ఊరట అని అంటున్నారు. మరి కోర్టు ఆదేశాల మేరకు అటు రైతులు ఇటు పోలీసులు పాదయాత్ర విషయంలో ఏమి చేస్తారన్నది చూడాలి. ఆగిన పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.