భాజపా లో చేరడానికి 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధమా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో చర్చలకు వచ్చింది నలుగురు ఎమ్మెల్యేలే అయినా.. బీజేపీలో చేరడానికి 25 మంది సిద్ధంగా ఉన్నారా? ఈ కేసు నిందితుల్లో ఒకరైన రామచంద్ర భారతి.. ‘సంతోష్ బీజేపీ’ పేరుతో సేవ్ చేసుకున్న నంబరు పంపిన వాట్సాప్ సందేశంలో ఇదే ఉందని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో నమోదు చేశారు.

అయితే తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో చర్చలకు వచ్చింది. నలుగురు ఎమ్మెల్యేలే అయినప్పటికీ బీజేపీలో చేరడానికి 25 మంది సిద్ధంగా ఉన్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కేసు నిందితుల్లో ఒకరైన రామచంద్ర భారతి సంతోష్ బీజేపీ
పేరుతో సేవ్ చేసుకున్న నంబరు పంపిన వాటా
సందేశంలో ఇదే ఉందని పోలీసులు కోర్టుకు
సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
దీనికి రుజువుగా రామచంద్రభారతి వాట్సాప్
సంభాషణలను కూడా ఆ రిపోర్టుకు జత చేశారు.
ఈ కేసులో ముగ్గురు నిందితుల ప్రమేయానికి సంబంధించిన కీలక విషయాలను పోలీసులు వారు రిమాండ్ చేసిన రిపోర్టులో పొందుపరిచారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే వారు ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపించారని పేర్కొన్నారు. ఒక్కో ఎమ్మెల్కేకూ రూ.50 కోట్లు ఇస్తామని ఆశ చూపించారని సంభాషణ నాయిస్ రికార్డుల్లో నమోదైందని తెలిపారు. ఆధారాల కోసం నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లు వాడినట్లు వెల్లడించారు. ఫాంహౌస్ లో బుధవారం మధ్యాహ్నం 3.05 గంటలకు రహస్య కెమెరాలు ఆన్ చేయగా 3.10 గంటలకు నిందితులతో కలిసి రోహిత్ రెడ్డి హాల్లోకి వచ్చారు. సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యేలు గుర్త బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు రాగా 3 గంటలకుపైగా నిందితులు ఎమ్మెల్యేలతో మాట్లాడారు. మీటింగ్ పూర్తి కాగానే ‘కొబ్బరి నీళ్లు
తీసుకురా’ అనే సంకేతం ఇవ్వాలని రోహిత్ రెడ్డికి
పోలీసులు సూచించారు. ఈమేరకు ఆయన
అనగానే.. పోలీసులు లోపలికి వెళ్లారు. ఇదే తరహాలో నిందితులు కర్ణాటక, ఢిల్లీ, ప్రాంతాల్లోనూ పార్టీ ఫిరాయింపులు చేసిన రామచంద్ర భారతి వాయిస్ రికార్డులో ఉంది. బీజేపీ నేత తుషార్కు రామచంద్ర భారతి ఫోన్ చేసినట్లు రికార్డు అయింది. ఎమ్మెల్యే రోహిత్రెడ్డికి మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలూ అక్కడికి వెళ్లారు. రిపోర్టుతోపాటు ఆధారాలు తెలంగాణకు సంబంధించి ముఖ్య విషయం మాట్లాడాలంటూ సునీల్ కుమార్, రామచంద్ర భారతి ఎస్ఎంఎస్ పంపించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు… ఈమేరకు స్క్రీన్షాట్స్ ను జత చేశారు. నందకుమార్ రామచంద్రభారతి జరిపిన వాట్సాప్ సంభాషణలనూ రిపోర్టుకు జోడించారు. ఏ2గా ఉన్న నందు డైరీలో 50 మంది టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివరాలను గుర్తించామని పేర్కొన్నారు.

సంతోష్ ఎవరు..?

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి శుక్రవారం లీకైన ఆడియో టేపుల్లో బీఎల్ సంతో తుషార్ అనే పేర్లు వినిపించడంతో. ఈ ఇద్దరు ఎవరన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్న సమాచారం. ప్రకారం. బీఎల్ సంతోషిణీ ప్రస్తుతం బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారని చెబుతున్నారు. ఇక తుషార్ పేరుతో మహారాష్ట్ర నుంచి ఒక నేత, కేరళ నుంచి మరో నేత ఉన్నారని, వారిద్దరిలో ఎవరిని ఆడియో టేపులో ప్రస్తావించారన్నది స్పష్టత లేదని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Leave A Reply

Your email address will not be published.