బండి సంజయ్ కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉపఎన్నిక ప్రచార పర్వం ముగిసింది. ఇదిలా ఉండగా ఎన్నికల నియమావళి ప్రకారం ఇతర జిల్లాల నుండి ప్రచారానికి విచ్చేసిన మంత్రులు ,ఎమ్మెల్యేలు తెరాస నాయకులు నియోజకవర్గాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి ఉండగా స్థానికంగానే ఉంటూ ఓటర్లను పలు రకాలుగా ధన,వస్తు ,మద్యం రూపేనా ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న సమాచారం ఉండడంతో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం అర్ధరాత్రి మునుగోడు నియోజకవర్గం చండూరుకు తన వాహనంలో బయలుదేరా రు .ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు బండి సంజయ్ కాన్వాయ్ ను జాతీయ రహదారిపై రామోజీ ఫిలిం సిటీ వద్ద మూడుసార్లు అడ్డుకున్నారు. దీంతో భారీగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడికి తరలి వెళ్లారు .ఇదిలా ఉండగా బండి సంజయ్ ను మునుగోడుకు వెళ్ళనిచ్చేది లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు పోలీసులకు వాగ్వివాదం నెలకొంది .దీంతో బండి సంజయ్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు .మునుగోడు నియోజకవర్గం నుండి తెరాస పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను నియోజకవర్గం నుండి పంపించే వరకు తాము ఇక్కడి నుండి కదిలేది లేదంటూ భీష్మించు కూర్చున్నారు .అదేవిధంగా పోలీసులు సైతం ఏకపక్షంగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. మునుగోడుకి వెళ్తుంటే తన కాన్వాయ్ ను అడ్డుకోవడంతోపాటు వెన్నంటి ఉన్న కార్యకర్తలను సైతం ఇష్టరీతిన వారిపై లా టి చార్జి చేయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. దీంతో జాతీయ రహదారిపై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.