బండి సంజయ్ ని పార్టీ కార్యాలయానికి తరలించిన పోలీసులు

.. కార్యాలయం నుండే ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్న బండి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ నుండి బండి సంజయ్ ని పోలీసు వాహనంలో తరలించారు. పోలీస్ కాన్వాయ్ ని వెంబడిస్తున్న బిజెపి కార్యకర్తలు వెంబడించగా  బండి సంజయ్ ను ఎక్కడికి తీసుకు వెళుతున్నారో సమాచారం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి వ్యవహారం, పోలీసుల, ఎన్నికల కమిషన్ తీరుపై తీవ్రంగా మండిపడ్డ బండి సంజయ్, * ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంఓ నుండి వచ్చిన ఆదేశాలకు, టీఆరెస్ దౌర్జన్యాలకు భయపడి నిన్న రాత్రి జరిగిన అరాచకాలకు సంబంధించిన వార్తలను కూడా ప్రసారం చేయలేదని నాయకులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీడియా సంస్థలే సీఎం చెప్పు చేతల్లో ఉండటం అత్యంత బాధాకరం అన్నారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ అరాచకాలు, మునుగోడు లో మంత్రులు, టీఆరెస్ ఎమ్మెల్యేలు దగ్గరుండి ఓటుకు పదివేలు పంచుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ రాక్షస పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి ఖూనీ చేస్తున్నారని మండిపడడంతో పాటు  రాక్షస పాలన అంతం కావాలంటే టిఆర్ఎస్కు రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్దకు తీసుకొచ్చిన పోలీసులు, పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి మునుగోడు ఎన్నికల పోలింగ్ సరళి,ని జరుగుతున్న పరిణామాలపై బండి ఆరా తీస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.