కలగర్భం లో కలిసిపోనున్న కేటీపీఎస్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కే తలమానికంగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో వెలుగులు విరజిమ్మిన పాల్వంచ కేటీపీఎస్ పాత విద్యుత్ ప్లాంట్ (ఓ అండ్ ఎం) ఇక కాలగర్భం లో కలిసిపోనున్నట్లు తెలుస్తోంది. ఇంటింటికీ కాంతులు పంచి, పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేసిన ఈ విద్యుత్ కర్మాగారం అతి త్వరలో కనుమరుగు కానుంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ)కి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2019 డిసెంబర్లో కాలం చెల్లిన ఈ కర్మాగారాన్ని మూసేసింది. ఇప్పుడు ప్లాంట్‌లోని ఇతర నిర్మాణాలను పూర్తిగా తొలగించాలనే ప్రతిపాదనలు తెరమీదకు రాగా, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధ్యయనం మేరకు నేలమట్టం చేసేందుకు అడుగులుపడుతున్నాయి. వందల టన్నుల భారీ లోహ యంత్రాలను జెన్ కో సంస్థ తుక్కుగా విక్రయించనుండగా, ఎంఎస్సీసీ కన్సల్టెన్సీ టెండర్లను ముంబైకి చెందిన హెచ్ ఆర్ కమర్షియల్ సంస్థ రూ.485.05 కోట్లకు దక్కించుకుంది. ఇక జెన్ కో నుంచి అధికారికంగా ఉత్తర్వులు రాగానే ఒకట్రెండు నెలల్లో తొలగింపు పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కేటీపీఎస్ ప్లాంట్ నిర్మాణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేంద్రంగా 1968 సంవత్సరంలో చేపట్టారు. జపాన్ టెక్నాలజీతో నిర్మించిన ఈ కర్మాగారం మొదటి దశ 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లతో ప్రారంభమైంది. రెండో దశలో 1967లో 60 మెగావాట్ల రెండు యూనిట్లు, మూడో దశలో 1974, 1975,లలో 120 మెగావాట్ల రెండు యూనిట్లు, నాలుగో దశలో 1977, 1978లో 120 మెగావాట్ల సామర్థ్యంతో మరో రెండు యూనిట్లను నిర్మించారు.

Leave A Reply

Your email address will not be published.