కొనుగోలు సెంటర్లో తూకం వేయడం లేదు

.. ద్వజమెత్తిన రామారెడ్డి జడ్పీటీసీ మోహన్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో వరి కొనుగోలు సెంటర్లు నామమాత్రంగా ప్రారంభం చేశారు. ఈ నేపథ్యంలో రామారెడ్డి జడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి మండల కేంద్రంలో వరి కొనుగోలు సెంటర్ ను పరిశీలించారు. కొందరు రైతులు మాట్లాడుతూ, మునుగోడు ఎన్నికలో ఉన్న దృష్టి రైతుల మీద లేదని జడ్పీటీసీ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ, వరి కొనుగోలు కేంద్రాలను నామమాత్రంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి , కొబ్బరికాయలు కొట్టెందుకే సరిపోయారు. కొందరు రైతులు దిగులు చెంది పచ్చి వడ్లను దళారలను ఆశ్రయించి విక్రయాలు జరుపుతున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ఏమాత్రం పట్టించుకోకుండా ఉండడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని జబ్బలు సరుసుకుంటున్న మండల నాయకులు తమ గ్రామంలో మాత్రం ఏవిధంగా కొనుగోలు సెంటర్ లో వడ్లను క్రయ విక్రయాలు ఎలా జరుపుతున్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో కొనుగోలు సిబ్బంది. డైరెక్టర్ లు ఏమి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. సోసైటి ఆద్వర్యంలో గెలుపొందిన డైరెక్టర్ లు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు సెంటరులో తూకం ప్రారంభిఃచకుంటే దర్నాలు , రాస్తారోకో లు ముమ్మరంగా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో. రామారెడ్డి మండల సొసైటీ వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి. పోసాని పేట్ ఎక్స్ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి. మండల్ యూత్ అధ్యక్షులు. చింతకుంట కిషన్. గ్రామ ఉప అధ్యక్షులు చింతకుంట ఎల్లయ్య. కాంగ్రెస్ సీనియర్ నాయకులు నామాల రవీందర్ జగన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.