బిజెపి పై చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ కి ఫిర్యాదు చేసిన టిఆర్ఎస్ పార్టీ
చౌటుప్పల్ పట్టణం, నారాయణపేట లోని జనగామ, చండూరు, మర్రిగూడలోని తమ్మలపల్లి వంటి గ్రామాల్లో భారీ ఎత్తున బిజెపి మద్యం మరియు నగదును పంపిణీ చేస్తుందని, అక్రమంగా బిజెపి మద్యం డబ్బులు పంపిణీ చేయడాన్ని వెంటనే ఆపేలా చర్యలు తీసుకోవాలి, నిన్న రాత్రి నుంచి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ధర్నాలు, నిరసనలు చేయడంతో పాటు ఈరోజు భారీగా నగదు పంపిణీ చేస్తూ… క్షేత్రస్థాయిలో అధికారుల పైన బెదిరింపులకు దిగుతుందని వికాస్ రాజ్ కు మంత్రి జగదీశ్ రెడ్డి విన్నవించారు. ఈ విషయంలో ఎలక్షన్ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని వికాస్ రాజ్ ను మంత్రి జగదీష్ రెడ్డి కోరారు.