చౌటకూర్ నుంచి మొదలైన భారత్ జోడో యాత్ర

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: భారత్ జోడో యాత్ర

పదవ రోజు శనివారం చౌటకూర్ నుంచి మొదలైంది నిన్న విరామం అనంతరం ఇవాళ తిరిగి ప్రారంభమైన యాత్ర. ఈరోజు ఆందోల్, జోగిపేట మీదుగా పెద్దాపూర్ వరకు సాగనున్న జోడో యాత్ర ఈయాత్రలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న రాహుల్. భారత భూ భాగాన్ని చైనా ఆక్రమించినా మోదీ చోద్యం చూస్తున్నారని ఫైర్ అయ్యారు. వేల కోట్ల భూముల కోసమే ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ అని మండిపాడ్డారు. కేసీఆర్ కు కమీషన్ల ధ్యాస తప్ప ప్రజా సమస్యలు పట్టవంటూ రాహుల్ విమర్శలు కురిపించడంతోపాటు దేశాన్ని ఏకతాటిపైకి తీసుకు రావడమే యాత్ర లక్ష్యమని స్పష్టం చేసిన రాహుల్.తెలంగాణలో మరో రెండు రోజుల్లో జోడో యాత్ర ముగియనుంది. ఇవాళ 21కి.మీ కొనసాగనున్న యాత్ర.దనపల్లి వద్ద భోజన విరామం, పెద్దాపూర్ లో కార్నర్ మీటింగ్, అల్లదుర్గ వద్ద రాత్రి బస చేయనున్నారు. కన్యాకుమారి నుంచి 58 రోజులుగా రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది.

Leave A Reply

Your email address will not be published.