అన్ని దానాల కన్నా విద్యా దానాం గొప్పది

.. శతాబ్ది ఉత్సవాలలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాపట్ల జిల్లాలోని వేటపాలెంలో బండ్లబాపయ్య విద్యాసంస్థల శతాబ్ది ఉత్సవాలలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 సంవత్సరాల ఫైలెన్‌ను ఆవిష్కరించారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ బండ్ల బాపయ్య విద్యా సంస్థల శతజయంతి ఉత్సవాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. చీరాలతో తనకు ప్రత్యేక అనుభందం ఉందని తెలిపారు. అన్ని దానాల కన్నా విద్యాదానాం గొప్పదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కష్టాల్లో ఉన్నవారికి సేవచేయడంలోనే తనకు తృప్తినిస్తుందని తెలిపారు. విద్య ఒక నిధి లాంటిదని. విద్య వ్యాపారం కాకూడదని అభిప్రాయపడ్డారు. చదువుతో పాటు విద్యార్థులు లోక జ్ఞానాన్ని కుడా పెంపోందించుకోవాలని తెలిపారు. తెలుగు భాష కన్ను లాంటిది. ఇంగ్లీషు భాష కళ్ళద్దాలు లాంటిందని వెంకన్ననాయుడు పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే కరణం బలరాం, పూర్వవిద్యార్థులు హాజరయ్యారు.

 

Leave A Reply

Your email address will not be published.