మునుగోడుకు మొనగాడెవరు..?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికకు ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన నేతలకు, ప్రజలకు నేటితో తెరపడనుంది. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. మూడు నెలల ఉత్కంఠకు మరికాసేపట్లో తెరపడనుంది. ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు, పార్టీల భవితవ్యం మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. నల్గొండ ఆర్జాలబావిలోని స్టేట్‌వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోడౌన్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు:

మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అందుకోసం 21 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. మొదట పోస్టల్‌ ఓట్లు, ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు చేస్తారు. ఉదయం 9గంటలకల్లా ఫస్ట్‌ రౌండ్‌ రిజల్ట్‌ రానుంది. అంటే, కౌంటింగ్‌ మొదలైన గంటకు మునుగోడు ఓటరు నాడి ఎలాగుందో క్లియర్‌ పిక్చర్‌ వచ్చేయనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకల్లా మునుగోడు మొనగాడెవరో తేలిపోనుంది. మొదటిగా 686 పోస్టల్‌ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎమ్స్‌ను ఓపెన్ చేస్తారు. ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్‌ బూత్స్‌ ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 15 రౌండ్లలో 1,2,3 రౌండ్లలో చౌటుప్పల మండలం లెక్కించనున్నారు. 4,5,6 రౌండ్లలో నారాయణపురం మండలం ఓట్ల లెక్కింపు జరుగనుంది. 7,8 రౌండ్లలో మునుగోడు ఓట్ల లెక్కింపు జరుగనుంది. 9,10 రౌండ్లలో చండూరు మండలం, 11,12,13,14,15 రౌండ్లలో మర్రిగూడ, నాంపల్లి, గుట్టుప్పల్‌ మండలాల ఓట్లను లెక్కించనున్నారు.

గంట గంటకు రౌండ్ల ఫలితాలు:

ఇక గంట గంటకు మునుగోడు ఓట్ల లెక్కింపు రౌండ్ల వారీగా ఫలితాలు రానున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో 93.13శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 2,41,855 లక్షల మంది ఓటర్లు ఉంటే.. 2,25,192 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముగ్గురు ఢిల్లీ పరిశీలకుల పర్యవేక్షణ.. సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, సీసీ కెమెరాల సమక్షంలో టోటల్‌ కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది.

Leave A Reply

Your email address will not be published.