విజయవంతంగా ముగిసిన జోడో యాత్ర

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సోమవారం విజయవంతంగా ముగిసింది. అక్టోబరు 23న తెలంగాణ లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర 24 నుంచి 26 వరకు విరామం తీసుకోగా 27 నుంచి తిరిగి యాత్ర ప్రారంభమైంది నవంబర్ 4వ తేదీన మరోసారి యాత్ర కు విరామం తీసుకోగా 7వ తేదీన మద్నూర్ మండలం మెనూరు వద్ద భారీ బహిరంగ సభతో ముగిసిన యాత్ర 7వ తేదీన రాత్రి మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షులకు యాత్ర ను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అప్పగించారు.

భారత్ జోడో యాత్ర కమిటీలు వేసి అద్భుతంగా యాత్ర ను నిర్వహించిన టీపీసీసీ 375 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 15 కిలోమీటర్ల యాత్ర సాయంత్రం 4 గంటల నుంచి 10 కిలోమీటర్ల యాత్ర సాగింది 19 అసెంబ్లీ నియోజక వర్గాల్లో, 7 పార్లమెంట్ నియోజక వర్గాలలో సాగిన యాత్ర.. ప్రతి రోజు సాయంత్రం కార్నర్ సమావేశాలు నిర్వహించారు. హైదరాబాద్ లో నవంబర్, 1,2 తేదీలలో సాగిన యాత్ర చారిత్రక చార్మినార్ వద్ద నుంచి నగరం నడిబొడ్డు నుంచి సాగిన రాహుల్ పాదయాత్ర. ప్రతి రోజు మధ్యాహ్నం సంఘాలతో సమావేశాలు.. వారి సమస్యలపై చర్చలు జరిపారు. సామాజిక సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, జర్నలిస్టులు, రైతులు తదితరులతో సమావేశం అయిన రాహుల్ పాదయాత్ర లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సమాజం రాహుల్ కు సంపూర్ణ మద్దతు లభించింది

. దారి పొడవునా స్వచ్చందంగా పాల్గొన్న ప్రజలు రాహుల్ తో కరచనాలకు, ఫోటోలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రజలు. పాదయాత్ర మధ్యలో పిల్లలతో రైతులతో, వృద్ధులతో, కార్మికులతో ఆగి మరి ఫోటోలు ఇచ్చిన రాహుల్. ఒకసారి క్రికెట్, ఒకసారి ఫుట్బాల్, లంబాడీ నృత్యాలు, బతుకమ్మలు ఆడిన రాహుల్ బతుకమ్మ లు, బోనాలు, సాగివసత్తులు లతో స్వాగతాలు పలుకగా పోతారాజులతో నృత్యం చేసిన రాహుల్. బహిరంగ సభలలో భారత్ జోడో యాత్ర లక్ష్యాలను వివరించిన రాహుల్, బీజేపీ మోడీ, టిఆర్ఎస్ కేసీఆర్ లపై పదునైన విమర్శలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.