కవిత్వం సమాజ దర్పణం కావాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కవిత్వం  సమాజ  దర్పణం  కావాలని  భారత  రాజ్యసభ సభ్యులు  బి .సి .సంక్షేమ  సంఘ  జాతీయ  అధ్యక్షులు  ఆర్ .కృష్ణయ్య  అన్నారు.హైద్రాబాద్  విద్యానగర్  లోని   బి .సి . భవనంలో తెలంగాణ  కవుల సంఘం  రాష్ట్ర  అధ్యక్షులు సుతారపు  వెంకట  నారాయణ  అధ్యక్షతన రాష్ట్రస్థాయి  కవిసమ్మేళనం  మరియు   ప్రముఖ  రచయిత  డాక్టర్  జనువాఁడ  రామస్వామి రచించిన  ‘నవకవితా  దర్పణం’  పుస్తకావిష్కరణ కార్యక్రమం  ఘనంగా  జరిగింది  .ఈ సంధర్బంగా  పుస్తకావిష్కరణ  చేసిన  ముఖ్య అతిథి  ఆర్ .కృష్ణయ్య  ప్రసంగిస్తూ  సాహిత్య పరంగా  సమాజంలో  ఎన్నో  మార్పులు  వచ్చాయనీ  కవులు  తమ రచనల  ద్వారా విభిన్న  కోణాల్లో తమ ప్రత్యేకతల్ని  చూపుతూసమాజంపై  ప్రభావాన్ని  కొనసాగించడం ఆహ్వానించదగిన విషయాలన్నారు రచనల ప్రభావంతోనే  భారత  స్వాతంత్ర్య  మరియు ప్రత్యేక  తెలంగాణ ఏర్పడ్డాయని  గ్రంథాలయాల వికాసం కోసం  కూడా  కవుల తమ సహకారాన్ని అందించాల్సిన  అవసరం  చాలా  ఉందన్నారు .కవిత్వ  వికాసం కోసం  తెలంగాణ  కవుల సంఘం  చేస్తున్న కృషి  విలువైనదని అన్నారు .డాక్టర్  జనువాఁడ   రామస్వామి పద్య కవితలో   ప్రత్యేకత లక్షణాలు  గల  వ్యక్తి అని ప్రముఖ  సాహితీ  వేత్తలు  అమ్మంగి  వేణు  గోపాల్  నాళేశ్వరం  శంకరం  పాలడుగు సరోజినీ దేవి  పల్లేరు  వీరాస్వామి  వివిద కోణాల్లో  అభినందించారు .ఈ సందర్బంగా కవులను ఘనంగా సత్కరించారు .కవిసమ్మేళనంలో తెలంగాణ కవుల సంఘ  కార్యవర్గ సభ్యులు రఘువీర  ప్రతాప్  కావూరి  శ్రీనివాస్  అనుముల ప్రభాకరా చారీ  డి .దైవాధీనం అబ్దుల్ రశీద్ తో  పాటు వివిద జిల్లాల కవులు ఆలూరి విల్సన్ కొమ్ము విజయ లక్ష్మి  కోదాటి అరుణ  నన్నపునేని విజయశ్రీ  ఓ .ప్రవీణ్ కుమార్  ఎం .నారాయణరెడ్డి విజయ్ కుమార్  తదితర కవులు  పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.