షోయెబ్ మాలిక్ కు సానియా మీర్జా తలాక్..తలాక్ ?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

హైద‌రాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. పాకిస్థాన్ క్రికెట‌ర్ షోయెబ్ మాలిక్ మ‌ధ్య వైవాహిక బంధం బ‌ల‌హీన‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. మాలిక్‌తో బ్రేక‌ప్ చెప్పేందుకు సానియా సిద్ధ‌మైన‌ట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో సానియా తాజాగా చేసిన ఓ పోస్టు ఆ ఇద్ద‌రి వైవాహిక బంధంలో స‌మస్య‌లు ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేస్తోంది. సానియా, మాలిక్ జంట విడాకులు తీసుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కూడా రూమ‌ర్లు వ్యాపిస్తున్నాయి. సానియా త‌న ఇన్‌స్టాలో చేసిన పోస్టు ఆమె అభిమానుల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప‌గిలిన హృద‌యాలు ఎక్క‌డికి వెళ్తాయి.. అల్లాను చేరేందుకేనా అంటూ సానియా త‌న ఇన్‌స్టాలో ఓ పోస్టు చేసింది. నిజానికి సానియా, మాలిక్ మ‌ధ్య ఎటువంటి స‌మ‌స్య‌లు ఉన్నాయో ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌దు. కానీ పాకిస్థాన్‌లోని మీడియా నివేదిక‌ల ఆధారంగా.. సోనియాను సోయెబ్ చీట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మాలిక్‌, సోనియా విడిపోయార‌ని, ఆ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం వేర్వేరుగా జీవిస్తున్న‌ట్లు పాక్ మీడియా పేర్కొన్నది.షోయెబ్‌, సానియా జంట‌కు ఓ కుమారుడు ఉన్నాడు. ప్ర‌స్తుతం సానియా వ‌ద్ద నాలుగేళ్ల ఇజాన్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. కానీ ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చిన స్ప‌ర్థ‌ల‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రు కూడా ఎటువంటి విష‌యాన్ని వెల్ల‌డించ‌లేదు. 2010లో సానియా, షోయెబ్ పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది.ఇజాన్ మాలిక్ బ‌ర్త్‌డేను ఇటీవ‌ల దుబాయ్‌లో జ‌రుపుకున్నారు. ఆ ఫోటోల‌ను మాలిక్ త‌న ఇన్‌స్టాలో షేర్ చేశాడు. కానీ సానియా మీర్జా మాత్రం ఆ ఫోటోల‌ను షేర్ చేయ‌లేదు. తాజాగా సానియా త‌న ఇన్‌స్టాలో చేసిన పోస్టు కొంత అర్ధంకాని తీరిలో ఉన్నా.. కొన్ని రోజుల క్రితం చేసిన మ‌రో పోస్టు కూడా భిన్న భావాన్ని వ్య‌క్తం చేసింది.

Leave A Reply

Your email address will not be published.