రాజకీయ స్వలాభకోసమే ఇడబ్లుఎస్ రిజర్వేషన్స్

.. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్క వెంకట్ యాదవ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  రాజకీయ స్వలాభకోసమే ఇడబ్లుఎస్ రిజర్వేషన్స్ అని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్క వెంకట్ యాదవ్ పేర్కొన్నారు. ఇడబ్లుఎస్ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు తీర్పు బీసీ ఎస్సీ ఎస్టీలను అనగాతొక్కడమే నన్నారు. 11 ఉంది జడ్జీలా రాజ్యాంగ ధర్మశాసనం కేసు విచారించాలి…. సుప్రీంకోర్టులో మరోసారి సవాల్ చేస్తాం మన్నారు. ఇడబ్లుఎస్ రిజర్వేషన్స్  సుప్రీంకోర్టు తీర్పుఇచ్చిన్న తీర్పుపై ఆయన మాట్లాడుతూ గతంలో 9 మంది జడ్జిల ధర్మాసనం రిజర్వేషన్లను 50% మించిన రాదని గుర్తు చేశారు. ఎస్సీఎస్టీఓబీసీ పేదలను విస్మరించడం సరికాదన్నారు.న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్ర భట్‌ మాత్రం ధర్మాసనంలో మెజారిటీ సభ్యుల తీర్పునకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భట్‌ రాసిన తీర్పుతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ ఏకీభవించారు. 103వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తోందని భట్‌ పేర్కొన్నారు. ‘‘సమాన అవకాశాలుప్రయోజనాలు కల్పించడానికి రిజర్వేషన్లను శక్తిమంతమైన ఆయుధంగా రూపొందించారు. ఇప్పుడు కొత్తగా ఆర్థిక కొలమానాల ఆధారంగా రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం ఆమోదయోగ్యమే. ఎస్సీఎస్టీఓబీసీలు ఇప్పటికే రిజర్వేషన్‌ ఫలాలు పొందుతున్నారన్న కారణంతో వారిని ఈ రిజర్వేషన్లనుంచి మినహాయించడం కొత్తగా అన్యాయం చేయడమే. వీరు సమాజంలోని నిరుపేదలుగా ఉన్నప్పటికీ ఇతరుల’ పేరుతో ఈ రిజర్వేషన్ల పరిధినుంచి మినహాయించారు. వాస్తవానికి కులంతరగతితో సంబంధం లేకుండా అత్యంత నిరుపేదలను దీని పరిధిలోకి తీసుకోవాల్సి ఉండగాఇప్పుడు కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే అవకాశం కల్పించినట్లయింది. రాజ్యాంగపరంగా వెనుకబడిన తరగతులుగా గుర్తింపుపొందిన ప్రజలను పూర్తిగా ఈ రిజర్వేషన్ల నుంచి విస్మరించడం వివక్షతప్ప మరొకటికాదు. అది సమానత్వ సిద్ధాంతాన్ని ధ్వంసంచేస్తోంది అన్నారు.

Leave A Reply

Your email address will not be published.