ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ కేసులో శ్రీలక్ష్మిని తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా పరిగణించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఐఏఎస్‌ అధికారిణిపై ఉన్న అభియోగాల్ని ధర్మాసనం కొట్టివేసింది. కోర్టు ఆదేశాలతో ఆమె ఏపీ చీఫ్‌ సెక్రటరీగా నియమితులయ్యేందుకు ఉన్న అడ్డంకులు తొలగినట్లైంది.2004-2009లో శ్రీలక్ష్మి మైనింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్న సమయంలో ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. మైనింగ్‌కు పాల్పడిన వారికి శ్రీలక్ష్మి సహకరించారని, ముడుపులు కూడా తీసుకున్నారంటూ సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ కేసు నమోదుతో ఏడాదిపాటు ఆమె జైలులో ఉండాల్సి వచ్చింది.

Leave A Reply

Your email address will not be published.