తెవివి జియో ఇన్ ఫర్మెటిక్స్ విభాగాన్నిపరిశీలించిన విద్యార్థులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షణ ప్రాంగణ లోని జియో ఇన్ ఫర్మెటిక్స్ విభాగానికి, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల బృందం ఫిజిక్స్ విభాగానికి చెందిన విద్యార్థులు బుదవారం సందర్శించారు, ఈ సందర్భంగా ఫిజిక్స్ మరియు జియో ఇన్ఫర్మేటిక్స్ ఏ విధంగా ఉపయోగించాలో ప్రాజెక్టు వర్క్ గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జియో ఇన్ఫర్మేటిక్స్, డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్ ప్రస్తుతం జిఐఎస్ ను ఉపయోగించి ప్రస్తుతం అధునాతనమైన స్పెషల్ ఇన్ఫర్మేషన్ సిస్టంను ఏ విధంగా సమాజానికి అనుసంధించాలో వివరించారు. జి ఎన్ ఎస్ ఎస్ ద్వారా లొకేషన్ ఎనాలసిస్ ను వివరించారు. డాక్టర్ ప్రతిజ్ఞ రిమోట్ సెన్సింగ్ ను ఉపయోగించి  సాటిలైట్ ఇన్ఫర్మేషన్ సిస్టం తదితర వివరాలు వెల్లడించారు. డాక్టర్ కవిత తోరన్ విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ ఏ విధంగా చేయాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్ గౌడ్, డాక్టర్ ప్రతిజ్ఞ, డాక్టర్ కవిత, డాక్టర్ సబిత, డాక్టర్ నారాయణ, ప్రభుత్వ ఫిజిక్స్ అధ్యాపకులైన డాక్టర్ రామకృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.