హైదరాబాదులో మెట్రో సేవలకు అంతరాయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  హైదరాబాద్‌లో మెట్రో సేవలకు స్వల్ప అంతరాయం కలిగింది. సాంకేతిక లోపంతో మియాపూర్-ఎల్బీ నగర్ రూట్‌లో మెట్రో రైళ్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. దాదాపు 30 నిమిషాల పాటు మెట్రో రైళ్లకు బ్రేక్ పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మెట్రో సేవలకు ఏమైందో అర్థం కాక కొద్దిసేపు ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. తర్వాత టెక్నికల్ ప్రాబ్లం వల్ల పెట్రో సేవలకు అంతరాయం కలిగినట్లు అధికారులు మైకులలో అనౌన్స్ చేశారు. దీంతో ప్రయాణికుల్లో కాస్త గందరగోళం తగ్గింది.సాంకేతిక లోపం తలెత్తడంతో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే రైళ్లు ఖైరతాబాద్, లక్డీకాపుల్‌తో పాటు పలు మెట్రో స్టేషన్లలో ఆగిపోయాయి. దాదాపు అరగంటకుపైగా ఆగిపోవడంతో ప్రయాణిలకు అసౌర్యం కలిగింది. సాంకేతిక లోపం కారణంగా మెట్రో రైళ్లు ఆగిపోయినట్లు స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు. కానీ సాంకేతిక లోపం ఏర్పడటానికి గత కారణాలు ఏంటనే దానిపై మెట్రో రైలు అధికారుల నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. మిగతా రూట్లతో పాటు పోలిస్తే మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటాయి. హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులకు సంబంధించి సాంకేతిక సమస్యలు ఏర్పడటం ఇది తొలిసారి కాదు. గతంలో అనేకసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొద్దిసేపు మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై మెట్రో అధికారులు దృష్టి పెట్టారని ప్రయాణికులు డిమాండ్ చేస్తోన్నారు.

Leave A Reply

Your email address will not be published.