ఘనంగా మహర్షి పితామహుడు పత్రీజీ 75వ అవతరణ మహోత్సవ వేడుకలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బాన్సువాడ ప్రతినిధి:  శ్వాస మీద ద్యాస పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో బాన్స్ వాడ పట్టణంలోని పిరమిడ్ ధ్యాన కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ధ్యాన అభ్యసకులు గురువులు శంకర్ స్వామి ఆధ్వర్యంలో బ్రాహ్మర్శి పితామహుడు పత్రీజీ 75వ అవతరణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పిరమిడ్ ధ్యాన కేంద్రం వ్యవస్థపకులు పూజ్య గురువులు భ్రమ్మర్షి సుభాష్ పత్రీ జీ 75వ అవతరణ మహోత్సవ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి ధ్యాన సభ్యులకు పంచి పెట్టారు.ఈ సందర్బంగా పిరమిడ్ కేంద్ర నిర్వాహక అధ్యక్షులు బెజుగం శంకర్ స్వామి మాట్లాడుతూ గురు పూజ్యులు బ్రాహ్మర్శి పత్రీ జీ సూచించిన నాలుగు మార్గాలు ధ్యానం లో శ్వాస మీద ధ్యాస పెడుతూ పద్మాసనంలో కూర్చొని మనసును నియంత్రణ చేస్తూ శ్వాస మీద ధ్యాసను ఏకీకృతం చేసినపుడే పరమాత్మ తత్వం అలవడుతుందన్నారు.ఆత్మను పరమాత్మునిలో లీనం చేస్తే శ్వాస మీద ధ్యాస నిలబడుతుందన్నారు. ఏక చిత్తంతో ధ్యానం చేస్తూ శ్వాస పై ధ్యాస పెడుతూ భగవంతుని స్మరిస్తూ కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలన్నారు. అప్పుడే మనలోని 72వేల నాడులు స్పందించినపుడే మనసును ఏకీకృతం చేయగలుగుతామని ధ్యాన సభ్యులకు సూచించారు.మనుషులు శరీరాన్ని శుద్ధిగా ఉంచుకొని శాఖా హారులుగా మారి మనసును ప్రశాంతముగా ఉంచుకొని నిత్య సాధన చేస్తే శ్వాస మీద ధ్యాస పరిపూర్ణంగ నిలుస్తుందని ఆయన అన్నారు.ప్రతీ రోజు శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యానం చేయడం వల్ల మనలో రోగ రుగ్మత శక్తులు హరించి పరిపూర్ణ ఆరోగ్య వంతులుగా జీవించగలమని అన్నారు.మనసును, ఇంద్రియాలను నిగ్రహంలో పెట్టుకొని సాధన చేయాలనీ సూచించారు.పత్రీ జీ తన దేహాన్ని చాలించిన ఆయన మన శ్వాసలో కొలువై ఉన్నారని ఆయన 75వ అవతరణ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం మహా భాగ్యంగా భావించి ధ్యానం చేస్తూ మన జన్మను సార్ధకం చేసుకోవాలన్నారు.ఈ సందర్బంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్యాన కేంద్ర సభ్యులు అంజయ్య, హన్మాండ్లు,రాము, వీరప్ప,సూర్య కాంత్ రావు, పురప్రముఖులు, ధ్యానకేంద్ర సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.