పేట్ల బుర్జు హస్పిటల్ అభివృద్ధికి రూ. కోటి కేటాయించిన ఎంపీ సంతోష్

- తన ఎంపీ నిధుల నుండి రూ. కోటి కేటాయించిన ఎంపి - అభినందించిన ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  కన్న తల్లిని, జన్మ భూమిని మరువద్దు అంటారు. ఇదే బాటలో రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ గారు, తను పుట్టిన పేట్ల బుర్జు ప్రభుత్వ హస్పిటల్ అభివృద్ధికి ఎంపీ నిధుల నుండి కోటి రూపాయలు కేటాయించడం సంతోషం. తాను పుట్టిన హస్పిటల్ ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని, అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయం.” అని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎంపీ సంతోష్ నిర్ణయం ఎంతో మందికి స్ఫూర్తిని కలుగజేసి , ప్రభుత్వ హస్పిటల్స్ అభివృద్ధికి ముందుకు రావడానికి దోహద పడుతుందన్నారు. ఈ నిధులతో పేట్ల బుర్జు హస్పిటల్ ను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎంపీ సంతోష్ ను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ హస్పిటల్ లో జన్మించిన వారు, ఆయా ఆసుపత్రుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. పేట్ల బుర్జు ఆసుపత్రి అవసరాలు, సౌకర్యాలు తీర్చేలా నిధులు వినియోగించాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.