స్వీడన్ జన్యు శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి

వేర్వేరు రంగాలకు చెందిన శాస్త్రేవేత్తలు, ఆర్థికవేత్తలు, ఇతర సామాజిక ఉద్యమకారులకు ప్రతి సంవత్సరం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల సందడి మొదలైంది. ఆర్థికం, వైద్యం, సామాజిక అంశాలు, పర్యావరణం, ఫిజిక్స్.. ఇలా విభిన్న రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించిన, వాటికి ఆద్యులైన శాస్తవేత్తలకు అందించే ఈ అవార్డుల ప్రకటన పరంపర కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. వారం రోజుల పాటు ఈ అవార్డుల ప్రకటన కొనసాగుతుంది. మెడిసిన్‌లో అద్భుతాలను ఆవిష్కరించిన స్వీడన్‌కు చెందిన జన్యు శాస్త్రవేత్త స్వాంటె పాబొను ఈ ఏడాది నోబెల్ బహుమతి వరించింది. మెడిసిన్‌కు సంబంధించిన నోబెల్ ప్రైజ్‌ కోసం పాబొ పేరును ఎంపిక చేసినట్లు జ్యూరీ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు నోబెల్ కమిటీ కార్యదర్శి థామస్ పెర్ల్‌మాన్ ఆయన పేరును ప్రకటించారు. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో గల కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా ఈ ప్రకటన చేశారు.

Leave A Reply

Your email address will not be published.