Khosta-2: కొవిడ్‌-19 మాదిరి కొత్త వైరస్‌.. రష్యా గబ్బిలాల్లో గుర్తింపు

వాషింగ్టన్‌: రెండున్నరేళ్ల క్రితం చైనాలో వెలుగు చూసినట్లుగా అనుమానిస్తున్న కొవిడ్‌-19 (Coronavirus).. మహమ్మారిగా అవతరించి ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే మాదిరి కొత్త వైరస్‌ (Khosta-2) రష్యా గబ్బిలాల్లో వెలుగు చూసినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ ఇన్‌ఫెక్షన్‌ గబ్బిలాల నుంచి మానవులకు సోకే సామర్థ్యం ఉందని తెలిపింది. ప్రస్తుతమున్న టీకాలు (Vaccines) ఈ వైరస్‌ను నిరోధించలేవని అమెరికా పరిశోధకుల అధ్యయనం పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.