విషమంగానే కృష్ణ ఆరోగ్యం

.. కాంటినెంటల్‌ వైద్యుల వెల్లడి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సూపర్‌స్టార్‌ ఘట్టమనేని కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు. ఈ మేరకు వైద్యులు మీడియాకు వివరాలను వెల్లడించారు.

‘‘రాత్రి సుమారు 2 గంటల సమయంలో కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారు. కార్డియాక్‌ అరెస్ట్‌ పరిస్థితి ఉండటంతో వెంటనే ఎమర్జెన్సీకి తరలించి సీపీఆర్‌ చేశాం. 20 నిమిషాల సీపీఆర్‌ తర్వాత కార్డియాక్‌ అరెస్ట్ నుంచి ఆయన బయటకొచ్చారు. అనంతరం కృష్ణను ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం అందిస్తున్నాం. రేపు మధ్యాహ్నం మరోసారి మీడియాకు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేస్తాం. మరో 48 గంటల వరకు కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేం’’ అని వైద్యులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.