సూపర్‌ స్టార్‌ కృష్ణ కన్నుమూత

Krishna-1200x800.jpg

టాలీవుడ్ సీనియర్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ(79) కన్నుమూశారు. ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో వెంటనే మహేష్ బాబు భార్య నమ్రత కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కార్డియాక్ అరెస్ట్ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులపై పడటంతో ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించిందని వైద్యులు తెలిపారు. నిన్నటి నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స పొందిన కృష్ణ.. మంగళవారం తెల్లవారు జామున 4 గంటలకు మరణించారు.

సూపర్‌ స్టార్‌ క్రిష్ణ యావత్‌ తెలుగు ప్రేక్షక లోకాన్ని దుఃఖసాగరంలో ముంచి దివికేగి ఆకసంలో తారగా నిలిచాడు. తెలుగు తెరను సుదీర్ఘకాలం శాసించిన సన్‌ ఆఫ్‌ ద సాయిల్‌ మరణం తెలుగు సమాజాన్ని దుఃఖసాగరంలో నింపింది.

కృష్ణ పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 1942 మే 31న జన్మించిన కృష్ణ ఎన్నో 300లకుపైగా సినిమాల్లో నటించారు.

Leave A Reply

Your email address will not be published.