సూపర్‌స్టార్‌ కృష్ణ సినీ ప్రస్థానం – జీవిత విశేషాలు

superstar_krishna_.jpg

☛ సూపర్‌స్టార్‌ కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి
☛ 1942 మే 31న బుర్రిపాలెంలో జన్మించారు
☛ తల్లిదండ్రులు – ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ
☛ కృష్ణ వయసు 80 ఏళ్లు
☛ నటశేఖరుడు, సూపర్‌స్టార్‌గా పాపులర్‌
☛ భారీ ఫ్యాన్‌ బేస్‌ ఉన్న కథానాయకుడు
☛ 2009లో పద్మభూషణ్‌ అందుకున్నారు
☛ 2008లో ఆంధ్రా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు
☛ కులగోత్రాలు, పదండి ముందుకు, పరువు ప్రతిష్టలో చిన్న చిన్న రోల్స్ చేసిన కృష్ణ
☛ 1965లో తేనె మనసులు తో గుర్తింపు తెచ్చుకున్న హీరో
☛ ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ చిత్రాల్లో నటించిన కృష్ణ
☛ సాంకేతికంగా ఎప్పుడూ ముందుండాలనుకునే కృష్ణ
☛ తొలి సినిమా స్కోప్‌ సినిమా – అల్లూరి సీతారామరాజు
☛ తొలి సినిమా స్కోప్‌ సాంఘిక సినిమా దేవదాసు
☛ తొలి సినిమా స్కోప్‌ పౌరాణిక సినిమా కురుక్షేత్రం
☛ తొలి సినిమా స్కోప్‌ జేమ్స్ బాండ్‌ మూవీ ఏజెంట్‌ గోపి
☛ తొలి సినిమా స్కోప్‌ కౌబాయ్‌ సినిమా దొంగలదోపిడి
☛ తొలి ఈస్ట్ మాన్‌ కలర్‌ సినిమా – ఈనాడు
☛ తొలి 70 ఎంఎం సినిమా – సింహాసనం
☛ తొలి డీటీయస్‌ సినిమా – తెలుగు వీర లేవరా
☛ కౌబోయ్‌ జోనర్‌ని తెలుగు స్క్రీన్‌కి పరిచయం చేసిన హీరో
☛ గూఢచారి 116, జేమ్స్ బాండ్‌ 777, ఏజెంట్‌ గోపి, రహస్యగూఢచారి, గూఢచారి 117 వంటి స్పై సినిమాలు చేసిన హీరో
☛ 17 చిత్రాలకు దర్శకత్వం వహించిన కృష్ణ
☛ పద్మాలయ స్టూడియోస్‌ ప్రొడక్షన్‌ కంపెనీపై సినిమాల నిర్మాణం
☛ మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు సినిమాలకు అభిమానులు ఫిదా
☛ అల్లూరి సీతారామరాజుకు నంది అవార్డు అందుకున్న హీరో
☛ అల్లూరి సీతారామరాజు తర్వాత వరుసగా 14 ఫ్లాపులు చూసిన హీరో
☛ పాడిపంటలు చిత్రంతో బౌన్స్ బ్యాక్‌ అయిన హీరో
☛ ఆదుర్తి సుబ్బారావు, వి.మధుసూదనరావు, కె.విశ్వనాథ్‌, బాపు, దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావులతో సినిమాలు చేసిన నటుడు
☛ 48 సినిమాల్లో విజయనిర్మల హీరోయిన్‌గా నటించారు
☛ 47 చిత్రాల్లో జయప్రద నాయికగా నటించారు.
☛ 1972లో కృష్ణ న‌టించిన 18 సినిమాలు రిలీజ్

Leave A Reply

Your email address will not be published.