కాలభైరవ  సన్నిదిలో లక్ష దీపారాధన మహోత్సవం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/రామారెడ్డి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి-రామారెడ్డి గ్రామాల మధ్య వెలసిన పవిత్ర ప్రాచీన పుణ్యక్షేత్రం  శ్రీ  కాలభైరవ  స్వామి ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ దక్షిణ కాశీగా విరసిసిల్లుతూ, భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలువ బడుతున్న  శ్రీకాలభైరవ స్వామి ఆలయం ,   దీపాలకాంతులతో  వెలుగొందుతుంది.  ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ,  కామారెడ్డి పట్టణం నుంచి 10 కి.మీల దూరంలో ఉంది. పూర్వం  రామిరెడ్డి, కామిరెడ్డి అన్నదమ్ములకు దేవుడు కలలో కనిపించి ఎడ్ల బండిపై భిక్కనూరు, మాచారెడ్డి మీదుగా కాలభైరవుని విగ్రహాన్ని తీసుకువచ్చారని ఎడ్ల బండి ఎక్కడ ఆగిపోతే అక్కడే నన్ను ప్రతిష్ఠించాలని కలలో  చెప్పినట్లు వేధ పండితులు చెబుతున్నారు. ఈ ఆలయం అనతి కాలంలోనే అభివృద్ధికి నోచుకుంది. ప్రతీ ఆదివారం పర్యాటకశాఖ నుంచి బస్సు  ఆలయానికి వస్తుందన్నారు.  ఎంతో చరిత్ర గల ఆలయం కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలతో పాటు వివిధ రాష్ట్ర లకు   చెందిన భక్తులు అధిక సంఖ్యలో  వచ్చి   పూజలు నిర్వహిస్తారని చెప్పారు.  కాలభైరవునికి ప్రీతికరమైన వారం మంగళవారం  కావడంతో భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆలయ మూలబావి వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తే  అంటు వ్యాధులు  నయమవుతాయని వారి నమ్మకం ,  ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం   ఆలయం ఆవరణలో .కోనేరు, మూలబావి వద్ద భక్తులు స్నానాలను ఆచరిస్తారు. ఆలయం ఆవరణలో శనేశ్వరాలయం, బద్దిపోచమ్మ ఆలయాలు ఉన్నాయి. ఆలయం లోపల సంతాన నాగదేవత,  శివాలయం, నవగ్రహ విగ్రహాలు ఉన్నాయి.  కార్తీకపౌర్ణమి అనంతరం 5 రోజుల పాటు ఇక్కడ భైరవుని జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయని అన్నారు.. ఈనెల13  నుంచి  17 వ తేది వరకు ఉత్సవాలు జరుగనున్నాయని ఈవో  ప్రభు  తెలిపారు. ఈ ఉత్సవాలకు తెల్లవారుజామున  తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌, మహారాష్ట్రలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వివిధ మార్గాల గుండా ఆలయానికి  చేరుకుంటారని అన్నారు.  ఉత్సవాల సందర్భంగా లక్ష దీపార్చన కార్యక్రమాన్ని భక్తులు  సోమవారం  ధీపాలు వెలిగించి దీపాల కాంతులతో దగదగ మెరిసిన బంగారు తండ్రి ఆకాలభరవుడు అద్బ తంగ ప్రత్యక్షైమనాడు. భక్తులు కోరుకున్న కోరికలు తీర్చుకున్నారని చెప్పారు.  నిర్ణయించిన తేదిలలో డోలారోహణం(తొట్లె), సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, రథోత్స  వం, అగ్నిగుండాలు  తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక గదులు, వసతులు, స్నానపు గదులు, నిత్యాన్నదానం  తదితర సౌకర్యాలు ఏర్పాట్లు చేశామని ఆలయ ఈఓ  ప్రభు చెప్పారు.  ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ కార్తీకమాస పూజల విశిష్టత గురించి మాట్లాడుతూ, కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని పిలుస్తారని అన్నారు.  ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం .అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన ఉందిని   వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. ‘శివునికి , విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున ,  మానవాళికి వారిద్దరిని భక్తులు  కోలిచి తరిస్తే వారికి శుభ అనుగ్రహం పొందడానికి ఈ మాసమం దోహదపడుతుంది.  దీనికి ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉందని. పురాణాలు తెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినం  పవిత్రమైన దే. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెలరోజులూ చేసే పూజల ఫలితం  పౌర్ణమి నాడు పూజలు చేయడం మరొకటి లేదని అన్నారు. ఈ మాసంలో  అనేక వ్రతాలు, పూజలు,  దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు చెపుతున్నాయని అన్నారు. దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. శివ, విష్ణు దేవాలయా లు రెండింటా దీపాలు వెలిగించాలన్నారు.  విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలమీద,బియ్యం పిండితో చేసిన ప్రమీదలలో దీపాలు వెలిగించాలన్నారు. ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అంకరించుకొని వెలిగించాలన్నారు. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండదీపాన్ని, ఆకాశదీపం పేరుతో ఎత్త్తెన ప్రదేశాల్లో భరిణలతో (కుండలు, లోహపాత్రలతో తయారుచేసి) వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో మొదలగు జల వనరుల్లో విడిచి పెడతారు. ఇలాచేయడం పుణ్యప్రదము, అష్టశ్వర్యాలు కలుగుతాయి. వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగుంచే ఆనేక దీపాలవల్ల వాటినుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి, వాతవరణ శుద్ధి అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. కార్తికమాసంలో  ఆచరించే వ్రతాలలో కేదారేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుందని చెప్పారు.. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికీపేరు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారుచేసిన ఆరాధనలోని చిన్నలోపంవల్ల సరైన వరం ఇవ్వదలచు కోలేదట శివుడు. అందుకే ‘అల్పాయుష్కుడు, అతిమేధావి అయిన కొడుకు కావాలా… పూర్ణాయుష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే- కుమారుణ్నే కోరుకున్నారు ఆ దంపతులు. అతడి వయసు పెరుగుతున్న కొలదీ వారిలో గుబులూ జోరెత్తుతోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టిపడింది. అమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని విన్నారు ఆ దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమబిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుం దని ఆలోచించి వివాహం చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్తకోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుంది ఆసాధ్వి. తక్షణమే తనభక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనాలు చెప్పాయి అని అన్నారు. ఈ పౌర్ణిమకు త్రిపుర పూర్ణిమ అని మరొకపేరు ఉందని అన్నారు.  తారకాసురుడికి  ముగ్గురు కుమారులు  బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా వరంకోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంమీద, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణంకాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు ఆబ్రహ్మకు. ఆ వర బలంతో పట్టణాలతో సహా సంచారంచేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గర కెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తాను ఇపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీమహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను (మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను) సంహరించాడమే అందువల్ల కార్తీక పౌర్ణమిగా ఈ పేరు వచ్చిందనీ పురాణాలు  చెపుతున్నాయన్నా రు.ఈ రోజు చేసే స్నానం, దీపారాధన, ఉపవాసం లాంటి అన్నింటి లోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి. ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వలన ఈ కాలపు వాతావరణ పరంగా మనకు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ప్రస్తుత కాలంలో ఉద్యోగాల బిజిలో కాని ఇతర ఏ కారణం చేతనైనా రోజు దేవుని పూజించి దీపారాధన చేసే సమయం లేని వారు ఆచరించలేని వారు ఈ పౌర్ణమినాడు ఆచరిస్తే చాలు, నెలంతా చేసిన ఫలితం కలుగుతుందని అర్చకులు వివరించి  చెప్పారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ చైర్మన్ బెజంగం మాలతి-సంతోష్  గుప్తా , ధర్మకర్తల మండలి సభ్యులు , సర్పంచ్ లు , ఉపసర్పంచులు మండల నాయకులు , భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.