ధాన్యం కొనుగోలుకేంద్రంలో సిబ్బంది చేతివాటం?

.. అడ్లూర్‌ ఎల్లారెడ్డి సహకారసంఘ పరిధిలో అక్రమ వసూళ్ళు .. లబోదిబోమంటున్న రైతులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ నెట్‌వర్క్‌ ఇంచార్జీ హైదరాబాద్‌: ఆరుగాలం కష్టపడి పండిరచిన ధాన్యాన్ని నేరుగా రైతుల నుండి గిట్టుబాటు ధర కల్పిస్తూ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారసంఘాల ద్వారా ధాన్యం కొనుగోలుకేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే కామారెడ్డి జిల్లా అడ్లూర్‌ ఎల్లారెడ్డి సహకార సంఘ పరిధిలో గత నెల 31వ తేదీ సంఘ పరిధిలో మొత్తం 13 ధాన్యం కొనుగోలుకేంద్రాలు, 10 సబ్‌సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా ప్రధానంగా నూతనంగా ఏర్పాటైన రామారెడ్డి మండలకేంద్రంలోని సబ్‌స్టేషన్‌ సమీపంలో గల ధాన్యం కొనుగోలుకేంద్రంలో సహకారసంఘ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. వరుస క్రమంలో చిన్న, సన్నకారు రైతుల ధాన్యం తూకం చేయకుండా సిబ్బంది పెద్దఎత్తు భూములు కలిగి ఉన్న భూస్వాములు, రైతుల వద్ద ఒక్కొక్కరి వద్ద నుండి 2000ల నుండి 3000ల రూపాయల వరకు వసూల్‌ చేసి కాంటా చేస్తున్నట్లు పలువురు రైతులు బాహాటంగా పేర్కొంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారి పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనప్పటికి ధాన్యం కొనుగోలుకేంద్రాల వద్ద జరుగుతున్న అక్రమ వసూళ్ళకు జిల్లా సహకారశాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

.. ధాన్యం కొనుగోలుకేంద్రాల వద్ద ఎలాంటి వసూళ్ళకు పాల్పడడం లేదు
.. బైరయ్య, సహకారసంఘ కార్యదర్శి
ధాన్యం కొనుగోలుకేంద్రాల వద్ద సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్న విషయంపై తెలంగాణ జ్యోతి నెట్‌వర్క్‌ ఇంచార్జీ సొసైటీ కార్యదర్శి బైరయ్యను వివరణ కోరగా కొనుగోలుకేంద్రాల్లో సీరియల్‌ ప్రకారం కాంటా పెడుతున్నామని, తమకు గిట్టనివారు అనవసరమైన ప్రచారం చేస్తున్నారని ఆయన సమాధానమిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.