8 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణలో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల క్లాసులను నేడు సీఎం కేసీఆర్ (Cm Kcr) వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా కేసీఆర్  (Cm Kcr) మాట్లాడుతూ..తెలంగాణలో ఇది సరికొత్త చరిత్ర. దేశానికే తెలంగాణ ఆదర్శం కాబోతుందని కొనియాడారు. ఈ అకాడమిక్ ఇయర్ లో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల (Governoment Medical Colleges)ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. రాష్ట్ర చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని సీఎం కేసీఆర్  (Cm Kcr) అభిప్రాయపడ్డారు. మారుమూల ప్రాంతాలకు మెడికల్ కాలేజీ (Governoment Medical Colleges)లు వస్తాయని ఎవరు ఊహించలేదన్నారు. కొత్త మెడికల్ కాలేజీలు (Governoment Medical Colleges) తెచ్చిందుకు మంత్రి హరీష్ రావు (Harish Rao) ఎంతో కృషి చేశారని ఈ సందర్బంగా కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మెడికల్ సీట్లు 2790 పెరిగాయన్నారు. గతంలో సీట్లకు ఇది 4 రేట్లు ఎక్కువని కేసీఆర్  (Cm Kcr) అన్నారు. అలాగే పీజీ సీట్లు కూడా 1180కి పెరిగాయన్న విషయాన్ని కేసీఆర్  (Cm Kcr) గుర్తు చేశారు.

Leave A Reply

Your email address will not be published.