ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనలో కేసీఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మోడీకి కౌంటర్ ఇవ్వడానికి కేసీఆర్ రెడీ అయ్యారు. తెలంగాణ గడ్డ మీదకు వచ్చి ఇక్కడ హైదరాబాద్ లోని బేగంపేటలో.. అటుపైన రామగుండంలో కూడా కేసీఆర్ సర్కార్ పై మునుపెన్నడూ లేనంతగా తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ప్రజల్లోకి ఆ విమర్శలు వెల్లాయి. కేసీఆర్ సర్కార్ పై మూఢనమ్మకాల ముద్రతోపాటు అవినీతి ఆరోపణలు మోడీ చేశారు. దీంతో ఇప్పుడు వాటికి కౌంటర్ ఇవ్వడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  పార్టీ నేతలతో కీలక భేటి నిర్వహించిన అనంతరం మోడీపై తీవ్ర విమర్శలకు కౌంటర్లకు కేసీఆర్ వెళతారని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పాజిటివ్ ఫలితం రావడంతోపాటు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రం ఢీ అంటే ఢీ అనడంతో తేల్చుకోవాలనే పట్టుదలతోనే కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.ఈ ఊపులోనే ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారని సమాచారం. ఇప్పుడే బీజేపీని ఓడించవచ్చని భావిస్తున్నారు. వేడి తగ్గక ముందే విజయం సాధించాలని చూస్తున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ నేతలతో కీలక సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకోనున్నారనే ప్రచారం సాగుతోంది.మరోవైపు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చు ప్రక్రియ కొనసాగుతోంది.  బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన తర్వాత పార్టీ యాంత్రాంగం ఏ విధంగా పనిచేయాలిపార్టీ కమిటీలు ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలపై చర్చించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ గా మారిన తర్వాత జాతీయ స్థాయిలో ఎలాంటి పోరాటాలు చేయాలిఅభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు రాజకీయంగా ఎలాంటి ఉద్యమాలు చేయాలనే దానిపై చర్చ జరిగే అవకాశం ఉంది.ఎలాగైనా మోడీకి కౌంటర్ ఇవ్వడం.. అలాగే తెలంగాణలో బలమైన పక్షంగా ఎదగడం.. బీఆర్ఎస్ పై సంచలన ప్రకటన చేసే దిశగానే కేసీఆర్ ఈ సమావేశం పెట్టినట్టు తెలుస్తోంది.ఇక ఏ సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళితే మళ్లీ అధికారం దక్కుతుందనే విషయంపై కేసీఆర్ పక్కా లెక్కలు జోతిష్యాన్ని పాటిస్తున్నారని తెలుస్తోంది. సంచలన నిర్ణయాలకు మారుపేరైన కేసీఆర్ ఈ మంగళవారం తర్వాత ఏమైనా చేయవచ్చనే పేరు తెచ్చుకున్నారు. ఆయన మనసులో ఏముందో ఈ మంగళవారం తేలనుంది.

Leave A Reply

Your email address will not be published.