ప్రజల వద్దకే వైద్యం

.. మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా వనపర్తి వైద్యకళాశాలతో పాటు రాష్ట్రంలోని మొత్తం ఎనిమిది కళాశాలల వర్చువల్ ప్రారంభోత్సవాన్ని హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసం నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తిలకించారు.ప్రజల వద్దకే వైద్యం, అందుబాటులో వైద్యవిద్యముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఒకేసారి ఎనిమిది వైద్యకళాశాలల తరగతుల ప్రారంభం దేశ చరిత్రలో నూతన అధ్యాయంరాబోయేకాలంలో హైదరాబాద్ లో అందే వైద్యసేవలు జిల్లా కేంద్రాలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వం లక్ష్యం అన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం, నూతనంగా రాష్ట్రంలో 100 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు ప్రజల ఆరోగ్యం పట్ల తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమన్నారు.బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలతో అందుబాటులోకి వైద్యుల సేవలుస్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండడం దురదృష్టకరంకేసీఆర్  కిట్ తో సాధారణ ప్రసవాలకు ప్రోత్సాహంఅమ్మవడితో ఆడబిడ్డలు, శిశువుల ఆరోగ్యానికి భరోసా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మిషన్ భగీరధ పథకం కింద ప్రజలందరికీ సురక్షిత తాగునీరుఅంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తాగునీటి సరఫరా ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టికి తార్కాణంముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా వనపర్తి వైద్యకళాశాలతో పాటు రాష్ట్రంలోని మొత్తం ఎనిమిది కళాశాలల వర్చువల్ ప్రారంభోత్సవాన్ని హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసం నుండి తిలకించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తిలో వైద్య కళాశాల తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో మంత్రి గారికి శుభాకాంక్షలు తెలిపిన మహబూబ్ నగర్ డీసీసీబీ చైర్మన్ నిజాంపాష, జోగుళాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పటేల్ విష్ణువర్దన్ రెడ్డి, జిల్లా రాజకీయ శిక్షణా తరగతుల కమిటీ చైర్మన్ మెంటెపల్లి పురుషోత్తం రెడ్డి, జడ్పీటీసీ భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.