ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిట్ విచారణ చేపట్టాలని హైకోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  4గురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ చేపట్టాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ అన్నారు. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలన్నదే బీజేపీ అభిప్రాయం. గౌరవ హైకోర్టు ఉత్తర్వులతో విచారణ పారదర్శకంగా జరిగే అవకాశముందని, బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. సీఎం ప్రెస్ మీట్ నిర్వహించడంపట్ల హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అభినందనీయం. సిట్ దర్యాప్తు పురోగతి వివరాలను బహిర్గతపర్చకూడదని, ఈనెల 29లోపు పురోగతి నివేదికను సీల్డ్ కవర్‌లో సింగిల్ జడ్జికి సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. తప్పు చేసినోళ్లకు, కుట్రదారులకు శిక్ష పడాల్సిందే. తెలంగాణ ప్రజలు కూడా కోరుకునేది ఇదే, గౌరవ హైకోర్టు ధర్మాసనంపట్ల మాకు నమ్మకం ఉంది. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక కుట్రదారులెవరన్నది తేలడంతోపాటు దోషులకు తగిన శిక్ష పడుతుందనే నమ్మకం మాకుందని బండి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.