క్రిస్మస్ సెలబ్రేషన్స్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  క్రిస్మస్ వేడుకలపై ఎస్సీ  అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ  మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం నాడు తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది క్రైస్తవ క్రైస్తవ కుటుంబాలకు నాణ్యమైన దుస్తులు పంపిణీ  చేయాలని నిర్ణయించారు.రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్ వర్గంలోని అతి బీద కుటుంబాలకు రెండు లక్షల 25 వేల చీరలు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ మొదటి వారంలో  క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన  సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఇలాంటి దుస్తులు పంపిణీ చేయాలనేది టాస్కో (TSCO) అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, మైనారిటీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ హెచ్ఎం. నదిమ్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏకే ఖాన్, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఎండి కాంతి వెస్లీ, మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ కాసిం, TSCO జేడీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.