ఠాగూర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏవీపీ బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో ఠాగూర్ కళాశాల ముందు ధర్నా. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముప్పిడి వెంకట్ మాట్లాడుతూ అక్రమంగా కళాశాల నడిపిస్తున్నటువంటి ఠాగూర్ కళాశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది పర్మిషన్ లేకుండా బాలికల హాస్టల్ నడిపించడం సరైనటువంటి కళాశాల రూములు లేకపోవడం అలాగే ప్రహరీ గోడ లేకపోవడం రూములలో ఎక్కడ కూడా డోర్లు గాని కిటికీలు గాని లేకపోవడం ఫైర్ సేఫ్టీ కూడా లేకుండా నడుస్తున్నటువంటి కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థులను ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తూ వాళ్ళను కొట్టడం మాట్లాడడం వెంటనే కళాశాల యజమానంపై చర్యలు తీసుకోవాలని చేస్తూ ఇలాంటి విషయాలు మరల పునరావృతం అయితే ఊరుకునే పరిస్థితి లేదని విద్యార్థి పరిషత్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి గూడెం శ్రీకాంత్ జగడం సాయిలు నీరుడి అనిల్ ఠాగూర్ కాలేజ్ ప్రెసిడెంట్ భాను అంజా గౌడ్ మేత్రి శ్రీకాంత్ జ్ఞానేశ్వర్ రవితేజ విద్యార్థులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.